నేటి తరం స్టార్ హీరోలలో మాస్ అనే పదానికి సరికొత్త నిర్వచనం తెలిపిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్.( Jr NTR ) స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ , ఇండస్ట్రీ కి వచ్చిన రెండేళ్లలోనే తిరుగులేని మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో 18 ఏళ్ళ వయస్సులో ఇండస్ట్రీ లో మాస్ హీరో గా ( Mass Hero ) ఎదిగిన వాళ్ళను మనం చూసి ఉండము.ఎన్టీఆర్ కి మాస్ స్టార్ హీరో గా పేరు వచ్చినప్పుడు ఇప్పుడున్న స్టార్ హీరోలెవ్వరికి కూడా ఆ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు.
అలా తెలుగునాట మాస్ హీరో గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ గా చక్రం తిప్పుతున్నాడు.#RRR సినిమాతో హాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా చేస్తే ఇలాంటి క్రేజీ హీరో తోనే సినిమా చెయ్యాలి అనేలా చేసాడు.

ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ కి అభయ్ రామ్( Abhai Ram ) మరియు భార్గవ్ రామ్( Bhargav Ram ) అని ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.స్టార్ కిడ్స్ లో క్యూట్ కిడ్స్ గా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరికీ సోషల్ మీడియా లో కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోనే కాదు, ఇతర హీరోల అభిమానుల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.ముఖ్యంగా రెండవ కొడుకు భార్గవ్ రామ్ అచ్చు గుద్దినట్టు ఎన్టీఆర్ పోలికలతో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.అయితే ఈ బుడ్డోడు గురించి లేటెస్ట్ గా కొన్ని విషయాలు బయటపడ్డాయి.
అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ #RRR మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా కొన్ని ఆంగ్ల పత్రికలకు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు.ఈ ఇంటర్వ్యూస్ లో ఒక విలేఖరి మీ అబ్బాయిలకు మీరు కాకుండా బయట హీరోల్లో ఎవరు బాగా ఇష్టం అని అడగగా ఎన్టీఆర్ దానికి చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్య పర్చింది.

ఆయన మాట్లాడుతూ ‘పెద్ద కొడుకు అభయ్ రామ్, సినిమా బాగుంది అనే టాక్ వస్తే అందరి సినిమాలు చూస్తాడు, కానీ చిన్నోడు భార్గవ్ రామ్ కి అల్లు అర్జున్( Allu Arjun ) అంటే బాగా ఇష్టం, అతని డ్యాన్స్ కూడా బాగా ఇష్టపడతాడు, పుష్ప సినిమా చూసినప్పటి నుండి ఆ సినిమాలోని డైలాగ్స్ కొడుతుంటాడు.ఈ విషయం బన్నీ కి కూడా చెప్పాను’ అంటూ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ చేసాడు.ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ ఎంత మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెలిసిందే.వీళ్లిద్దరు ఒకరిని ఒకరు బావ అని ప్రేమగా పిలుచుకుంటారు.రీసెంట్ గా అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు ట్విట్టర్ లో వీళ్లిద్దరు సరదాగా చేసుకున్న చిట్ చాట్ ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే.వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుంది అని అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు.
వాళ్ళ కోరికలు నెరవేరుతాయో లేవో చూడాలి.







