రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ లో ఎక్కువ సంఖ్యలో యువత పాల్గొనాలని ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకట్ పిలుపు నిచ్చారు.ఖమ్మం జిల్లా సంజీవరెడ్డి భవన్ లో NSUI అధ్యక్షులు వేగినాటి ఉదయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో బలమూరు వెంకట్ పాల్గొని మాట్లాడుతూ 18వ తేదీన జరిగే ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్లో ఎక్కువ మొత్తంలో విద్యార్థులను యువకులను పాల్గొనే NSUI కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.
విద్యార్థుల సమస్యలపై పోరాడాలని NSUI మద్దతు ఉంటుందని గ్రామ గ్రామాన NSUI బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న NSUI రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్ మనోజ్ వర్మ,యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎడ్లపల్లి సంతోష్ జిల్లా ఎన్ఎస్ యుఐ ఉపాధ్యక్షులు మోహన్ ప్రధాన కార్యదర్శి నవీన్ , ఆసిఫ్,ఆజాద్, సెక్రటరీ హరినాథ్ నాయక్, హరీష్, గోపి, ఆకాష్, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు
.






