యూకే : బోరిస్ జాన్సన్ హానర్స్ లిస్ట్‌లో ఇద్దరు భారత సంతతి నేతలకు చోటు ..!!

బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్( Boris Johnson ) హానర్స్ లిస్ట్‌లో భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్, కుల్వీర్ సింగ్ రేంజర్‌లకు స్థానం దక్కింది.దేశ మాజీ ప్రధానులకు గౌరవ సూచికంగా హానర్స్ లిస్ట్ ప్రకటించడం యూకేలో ఆనవాయితీగా వస్తోంది.38 హానర్స్, ఏడు పీరేజ్‌లు ఇందులో వుంటాయి.ప్రధానిగా బోరిస్ జాన్సన్ తప్పుకున్న దాదాపు 9 నెలల తర్వాత ప్రస్తుత ప్రధాని రిషి సునక్ ఈ హానర్స్ లిస్ట్‌కు ఆమోదం తెలిపారు.

 Indian-origin Priti Patel, Kulveer Ranger In Ex Uk Pm Boris Johnson's Honours Li-TeluguStop.com

ఇక అవార్డ్‌ల విషయానికి వస్తే మాజీ హోం సెక్రటరీ ప్రీతి పటేల్‌ని ‘‘ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్’’ డేమ్స్ కమాండర్‌గా , కుల్వీర్ సింగ్‌( Kulveer singh )ని లార్డ్స్‌గా ప్రకటించారు.ఈ సందర్భంగా ప్రీతి పటేల్ స్పందిస్తూ.

బోరిస్ జాన్సన్ దేశానికి విశేష సేవలందించారని ప్రశంసించారు.ఉక్రెయిన్‌కు మద్ధతు కూడగట్టడంలో ప్రపంచానికి నాయకత్వం వహించారని, బ్రెగ్జిట్‌ను పూర్తి చేశారని కొనియాడారు.మార్గరెట్ థాచర్ తర్వాత ఎన్నికల్లో అత్యంత విజయవంతమైన యూకే ప్రధానిగా నిలిచారని ప్రీతి పటేల్ అన్నారు.

ఇదీ ప్రీతి పటేల్ ప్రస్థానం :

గుజరాతీ ఉగాండా సంతతికి చెందిన ప్రీతి పటేల్( Priti Patel ).2019 జూలై నుంచి హోం కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.థెరెసా మే ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ప్రీతికి ఉంది.

అయితే రెండేళ్ల క్రితం ఓ వివాదం కారణంగా ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది.అప్పుడు అంతర్జాతీయ అభివృద్ధి మంత్రిగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు బ్రిటన్( Britain ) అందించే ఆర్థిక సహకారానికి సంబంధించిన వ్యవహారాలను ఆమె పర్యవేక్షించేవారు.

Telugu Boris Johnson, Britain, Conservative, Indian Origin, Kulveer Ranger, Lond

లండన్‌( London )లోనే జన్మించిన ప్రీతి .తల్లిదండ్రుల స్వస్థలం గుజరాత్‌.వారు మొదట ఉగాండాలో నివసించేవారు.అయితే, ఉగాండాలో అప్పుడున్న పాలకుడు దక్షిణాసియాకు చెందినవారిపై దేశ బహష్కరణ విధించారు.దీంతో ప్రీతి తల్లిదండ్రులు బ్రిటన్‌కు వలసవచ్చారు.వైట్‌ఫోర్డ్ గ్రామర్ స్కూల్, వెస్ట్‌ఫీల్డ్ టెక్ కాలేజ్, కీల్ వర్సిటీ, ఎసెక్స్ విశ్వవిద్యాలయాల్లో ప్రీతి చదువుకున్నారు.20 ఏళ్లు కూడా నిండకముందే ప్రీతి కన్జర్వేటివ్ పార్టీలో చేరారు.కన్జర్వేటివ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉద్యోగినిగా సేవలందించారు.1995 నుంచి 1997 వరకూ జేమ్స్ గోల్డ్‌స్మిత్ నేతృత్వంలోని రెఫరెండమ్ పార్టీకి ప్రతినిధిగా ఉన్నారు.ఆ పార్టీ యురోపియన్ యూనియన్‌ను వ్యతిరేకించింది.

డేవిడ్ కేమరూన్ హయాంలో ఏడాదిపాటు ట్రెజరీ శాఖలో సహాయమంత్రిగా, మరో ఏడాది ఉద్యోగకల్పన శాఖలో మంత్రిగా ఆమె పనిచేశారు.

Telugu Boris Johnson, Britain, Conservative, Indian Origin, Kulveer Ranger, Lond

ఇక కుల్వీర్ రేంజర్ విషయానికి వస్తే. పంజాబ్ నుంచి వలస వచ్చిన సిక్కు తల్లిదండ్రులకు జన్మించారు.ఆయన డిజిటల్ వ్యూహంపై యూకే ప్రభుత్వానికి ప్రత్యేక సలహాదారుగా వ్యవహరించారు.2011లో లండన్‌ నగరానికి పర్యావరణం, డిజిటల్ వ్యవహారాలపై డైరెక్టర్‌గా నియమితులైన ఆయన.బైక్ దొంగతనాలను అరికట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.2008 మేలో బోరిస్ జాన్సన్ మేయర్‌ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కుల్వీర్‌ను రవాణా పాలసీకి డైరెక్టర్‌గా నియమించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube