సినిమా ఇండస్ట్రీ లో చాలామంది నటులు చాలా రకాల పాత్రలు పోషిస్తూ మంచి పేరు సంపాదించుకుంటారు.అలాంటి వాళ్లలో అక్కినేని నాగేశ్వర రావు( Akkineni Nageswara Rao ) కూడా ఒకరు.
సినిమా ఇండస్ట్రీ కి ఉన్న రెండు కళ్ళలో ఒకరు ఎన్టీయార్( NTR ) కాగా మరొకరు నాగేశ్వర రావు అని అందరు చెప్పు కుంటూ ఉంటారు.ఈయన అప్పట్లో లవర్ బాయ్ సినిమాలు ఎక్కువ గా చేస్తూ చాలా రకాలైన ప్రేమకథ చిత్రాలకి హీరో గా మారాడు.
నాగేశ్వర్ రావు అంటే చాలు అమ్మాయిలు బాగా ఇష్టపడే వారు.అయితే నాగేశ్వర రావు తన కెరియర్ లో చాలా రకాలైన క్యారెక్టర్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక ఆయన ఎప్పుడైతే సినిమాల్లో నటించడం స్టార్ట్ చేసాడో అప్పటి నుంచి అని క్యారెక్టర్ లలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు.కానీ ఆయన ఫ్యూచర్ లో కొన్ని పనులు చేయకూడదు కొన్ని క్యారెక్టర్లలో నటించకూడదు అని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు…

అయితే ఆయన చేసిన భూకైలాస్ సినిమాలో( Bhookailas Movie ) నారదుడి పాత్రలో( Narada Role ) నటించాడు.ఈ సినిమాలో దాదాపు అన్ని సీన్స్ లలో కనిపించే పాత్ర అవ్వడం తో ఆ పాత్ర కోసం ఆయన ప్రాణం పెట్టి నటించి మెప్పించాడు.ఆ క్యారెక్టర్ చేసినందుకు ఆయనకి మంచి పేరు వచ్చినప్పటికీ చాలా ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ప్లాప్ అయింది.
ఇక దానితో నారదుడి పాత్ర లో నటించడం మానేసాడు.అలాగే పౌరాణిక సినిమాల్లో కూడా నటించడం మానేసాడు.తనకి సెట్ అయినా సాంఘిక సినిమాల్లోనే నటించడం మంచిది అని డిసైడ్ అయిపోయి అలాంటి సినిమాల్లో మాత్రమే నటించాడు.ఈ విషయం లో ఆయన కి ఎంత మంది ప్రొడ్యూసర్స్ చెప్పిన కూడా వినలేదు.

అయితే ఇలాంటి విషయాల్లో నటులు కొందరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న తర్వాత కొందరు చెప్తే మళ్లీ వాళ్ల డెసిషన్స్ ని మార్చుకొని ఆ పాత్రల్లో నటిస్తారు, అలాంటి వాళ్లలో సావిత్రి గారు ఒకరు ఆమె లైఫ్ లో వేశ్య పాత్ర చేయకూడదు అని ఫిక్స్ అయింది కానీ కన్యాశుల్కం సినిమాలో ఎన్టీయార్ చెప్పడం వల్ల తన డెసిషన్ మార్చుకొని ఆ పాత్ర లో నటించి మెప్పించింది…కానీ నాగేశ్వర రావు మాత్రం ఎవ్వరు చెప్పిన వినకుండా తాను మాత్రం పౌరాణిక సినిమాల్లో నటించలేదు.అందుకే మాట మీద నిల్చున్న ఒకే ఒక వ్యక్తి గా నాగేశ్వర రావు ని చెప్తూ ఉంటారు…ఇక దాంతో పాటు గా ఆయన లైఫ్ లో మద్యం తాగను అని తీసుకున్న నిర్ణయానికి కూడా చివరి వరకు కట్టుబడి ఉన్నాడు







