టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఈయన చేసే ప్రతి ఒక్క సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం కొరటాల శివ (Koratala Shiva)దర్శకత్వంలో రాబోతున్న దేవర సినిమా (Devara Movie) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తరువాత ఈయన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా రాబోతుంది అని తెలియగానే ఈ సినిమాపై భారీ అంచనాల పెరిగిపోయాయి.అయితే ఈ సినిమా వచ్చే ఏడాది షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుందని తెలుస్తుంది.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమా (Salar Movie)షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ సినిమా పనులు మొదలుకానున్నాయి.
అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించడం కోసం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను(Priyanka Chopra) పరిశీలిస్తున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాలో విలన్ గా స్టార్ హీరో భార్య మరొక స్టార్ హీరోయిన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలను కూడా ఈ సినిమాలో భాగం చేయబోతున్నారని తెలుస్తుంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) నటించబోతున్నారని సమాచారం.బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఐశ్వర్యారాయ్ ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నారని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే కనుక నిజం అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుందంటూ అభిమానులు భావిస్తున్నారు.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.







