టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( samantha )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
అయితే కేవలం సినిమాల విషయంలోనే కాకుండా అనేక విషయాల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో తెలుస్తోంది.మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈమె ఎక్కువగా ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటోంది.
మరి ముఖ్యంగా సమంత సినిమా ప్రమోషన్స్ సమయంలో కావాలని సింపతి కోసం ట్రై చేస్తున్నట్లు నటిస్తోంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ విషయంలో సమంత దారుణంగా ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటోంది.తాజాగా కూడా మరోసారి ఒక రేంజ్ లో ట్రోలంగ్ గురి అవుతోంది.కాగా కొందరు సమంతకు మద్దతుగా మాట్లాడుతూ ఆమెను ట్రోల్ చేయటం పద్దతి కాదని అంటున్నారు.
కాగా సామ్ సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం సైబీరియా( Siberia )కి వెళ్ళిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే సమంత అక్కడ ఒక పబ్బులో హుషారుగా పుష్పలోని ఊ అంటావా ఊఊ అంటావా పాటకు చిందులు వేసింది.
దాంతో అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఒక వర్గం ప్రేక్షకులు ఆమెను ట్రోల్స్ చేయడం టార్గెట్ చేశారు.

యశోద, శాకుంతలం( Yashoda ) ప్రమోషన్ లలో పదే పదే హెల్త్ కంప్లైంట్ గురించి ప్రస్తావించి కన్నీళ్ళు పెట్టుకుని, సానుభూతి కార్డు ప్లే చేసిన సామ్ హఠాత్తుగా ఫారిన్ వెళ్ళగానే హుషారుగా చలాకీగా మారిపోవడం వెనుక రహస్యం ఏంటో చెప్పాలని ట్రోల్స్ చేస్తూ ఆమెను ప్రశ్నించడం మొదలుపెట్టారు.తన సినిమాలను జనాలు థియేటర్లకు వచ్చి చూడాలనే ఉద్దేశంతో ప్రతిసారి సింపతీ కార్డు ప్లే చేయడం వర్కౌట్ కాదు అంటూ చురకలు అంటించారు.అయితే నిజానికి ఈ వీడియోని చూస్తే సమంత రికవర్ అయినట్లు కనిపిస్తోంది.
కానీ శాకుంతలం సమయంలో మాత్రం నీరసంగా, కళ్ళజోడు పెట్టుకుని చాలా ఇబ్బందిగా కనిపించింది.అయితే మరి నిజంగానే సమంతకు హెల్త్ బాగాలేదా లేదంటే నెటిజన్స్ అభిప్రాయపడుతున్నట్టుగా ప్రమోషన్స్ లో సింపతి కోసమే అలా ప్రవర్తిస్తుందా అన్నది తెలియాలి అంటే సమంత స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే మరి.







