రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు .అవసరాలు అవకాశాలు ఆధారంగానే రాజకీయ పొత్తులు ఏర్పడతాయి.
రాజ్యసభలో తమ అవసరాల కోసం మోడీ ప్రభుత్వం వైసీపీతో ( YCP )తెరవెనక ఒప్పందాలకు కుదుర్చుకుందన్న ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తూ ఉన్నాయి.అలానే ఏపీకి ప్రత్యేక హోదాపై కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కానీ రైల్వే నిధులు విడుదల విషయంలో కానీ కేంద్రం మొండి చెయ్యి చూపిస్తున్నా కూడా కేంద్రాన్ని పల్లెత్తు మాట అనని అధికార పార్టీ తీరు చూసిన తర్వాత సామాన్య ప్రజల లో కూడా వీరు ఒక ఒప్పందంలో ఉన్నారు అన్న అనుమానాలు అయితే వచ్చాయి .అయితే కాలం మారింది అవసరాలు మారాయి.

వచ్చే ఎన్నికలలో వైసిపి పట్ల ప్రజాభితిరేకత ఎక్కువగా ఉందన్న సర్వే రిపోర్ట్ లు అందుకున్న కేంద్రం తన స్వరం మారుస్తున్నట్లుగా తెలుస్తుంది .ఇంత కాలం దూరం పెట్టిన చంద్రబాబుతో ఇటీవల అమిత్ షా సుదీర్ఘ చర్చ చేశారు .కొత్త పొత్తులకు శంకుస్థాపన జరిగిందని వచ్చే ఎన్నికలలో జనసేన -భాజాపా- తెలుగుదేశం కూటమి పోటీ చేయబోతుందన్న ఊహాగానాలకు ఇప్పుడు నడ్డా ,అమిత్ షా( Amit Shah ) విమర్శలతో బలం వచ్చి నట్లయ్యింది .ఇప్పటివరకు చూసి చూడకుండా పోయినా ఇప్పుడు ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలని కేంద్ర భాజపా నిర్ణయించుకోవడంతో శ్రీకాళహస్తిలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రభుత్వం పై సూటి విమర్శలు చేశారు జాతీయ బిజెపి అధ్యక్షుడు జేపి నడ్డా( J.P.Nadda )దానికి కొనసాగింపుగా వైజాగ్ మీటింగ్ లో అమిత్ షా తీవ్రస్థాయి విమర్శలు చేశారు.ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ అధోగతి పాలు చేశారని ,స్కామ్ లు కుంభకోణాలు తప్ప ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు అని ,కేంద్ర నిధులను కూడా దారి మళ్లించి తమ పేరుతో ప్రజలకు పంచుతున్నారని, రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయిందని ప్రభుత్వ చేతకాని పరిపాలన వల్లే రాష్ట్రానికి ఈ గతి పట్టింది అంటూ ఇద్దరు నేతలు డైరెక్ట్ గా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

పాత స్నేహానికి వ్యాలిడిటీ అయిపోయిందని కొత్త పొత్తుల కోసం తాము చూస్తున్నామన్న ప్రత్యక్ష సంకేతాలను ఇవ్వడానికే నేతలు ఇలా మాట్లాడారని వార్తలు వస్తున్నాయి .అయితే ఇప్పటివరకు బిజెపి విమర్శలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతగా స్పందించలేదు అయితే విమర్శలు వేడి ఇంకా పెరిగితే కచ్చితంగా స్పందించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఏ స్టాండ్ తీసుకోవాలన్న ఆలోచన లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి.







