తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటి రోజా(Roja) ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలలో ఎంత చురుగ్గా పాల్గొంటున్నారు.ప్రస్తుతం ఈమె ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా( Andhra Pradesh Tourism Minister ) బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.
నగరి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఇక చిత్ర పరిశ్రమలో ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి నటిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇక రాజకీయాలపై ఆసక్తి ఉండడంతో రాజకీయాలలోకి వెళ్లినటువంటి ఈమె ప్రస్తుతం మంత్రిగా(Minister) బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఇక ఈమె ఎమ్మెల్యేగా కొనసాగే సమయంలో బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.
బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్(Jabardasth) కార్యక్రమానికి దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు ఈమె జడ్జిగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను కూడా సందడి చేశారు.ఇలా వృత్తి పరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి రోజా అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తుంది.

గత వారం రోజులుగా ఈమె కాలు నొప్పి(Leg Pain) సమస్యతో బాధపడుతున్నారట.కాలు బెనకడంతో వారం రోజులపాటు ఫిజియోథెరపీ చేయించినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో ఈమెను చెన్నైలోని అపోలో (Apollo)ఆసుపత్రికి తరలించారు.ఇలా కాలు నొప్పి సమస్యతో బాధపడుతున్నటువంటి ఈమె ప్రస్తుతం చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో ఒక పది రోజులపాటు నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలకు రోజా దూరంగా ఉండబోతున్నారని తెలుస్తుంది.







