బాలీవుడ్ లో వరుసగా సినిమా లు చేస్తూ బుల్లి తెరపై సందడి చేస్తున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్( mrunal thakur ) కి తెలుగు లో సీతారామం సినిమా( Seetharam movie ) తో మంచి ఎంట్రీ లభించింది.సీతారామం సూపర్ హిట్ తో ఈ అమ్మడు తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తుందని అంతా భావించారు.
కానీ ఇప్పటి వరకు నాని తో మాత్రమే నటించేందుకు ఓకే చెప్పింది.ఆ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకున్నాయి.
ఆ తర్వాత తెలుగు లో మృణాల్ నటించబోతున్న సినిమా ఏంటి అంటే ఇప్పటి వరకు క్లారిటీ లేదు.ఇక మృణాల్ ను ఇటీవల ఒక ప్రముఖ నిర్మాత యంగ్ హీరో సినిమా కోసం సంప్రదించాడట.
కానీ మృణాల్ మాత్రం తన పారితోషికంతో నిర్మాతను( mrunal thakur remuneration ) అదరగొట్టిందట.ఒక వైపు బాలీవుడ్ లో ఫ్లాప్స్ పడుతున్నాయి.
మరో వైపు తెలుగు లో పెద్దగా ఆఫర్లు రావడం లేదు.

అయినా కూడా ఈమెకు వచ్చిన ఆఫర్ల గురించి పట్టింపు లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఈ స్థాయి లో ఆఫర్లు వస్తున్న ఈ సమయంలో పారితోషికం కారనంగా నో చెప్పడం ఏంత మాత్రం కరెక్ట్ కాదు అనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.ప్రస్తుతం మృణాల్ హిందీ లో చేస్తున్న సినిమా లు ఏమైనా ఉన్నాయా అంటే భారీ చిత్రాలు ఏమీ లేవు.
అయిన కూడా టాలీవుడ్ సినిమా ను కాదంటుంది అంటే కచ్చితంగా ఆమె కు సౌత్ సినీ ఇండస్ట్రీ అంటే చిన్న చూపు ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ తనకు తెలుగు లో మంచి విజయం దక్కింది.
కనుక తెలుగు లో వరుస సినిమా లు చేసేందుకు తాను సిద్ధం గా ఉన్నట్లుగా పేర్కొంది.కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం ఆమె పెద్దగా ఆసక్తి చూపిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
నాని సినిమా కూడా హిట్ అయితే అప్పుడు ఈమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ దక్కే అవకాశాలు ఉన్నాయి.







