సోషల్ మీడియా( Social Media ) అందుబాటులోకి వచ్చాక దేశం నలుమూలలా జరిగే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోగలుగుతున్నాం.ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం.
అలాంటి వీడియోలలో డ్యాన్స్, మ్యూజిక్ వీడియోలు కూడా పెద్ద సంఖ్యలో వైరల్ అవుతూ ఉంటాయి.ఎందుకంటే, ఇలాంటి వీడియోలకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఆకర్షితులు అవుతుంటారు.
ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ చిన్నారి డ్యాన్స్( Kids Dance ) వీడియోను చూస్తే మీరు కళ్లు తిప్పుకోలేరంటే నమ్మశక్యం కాదు.

అవును, ఆ వీడియోలోని చిన్నారి వేసిన స్టెప్పులు చూస్తే మీరు సంభ్రమాశ్చర్యాలకు గురవ్వడం గ్యారంటీ.ఇక వైరల్ వీడియోని గమనిస్తే, పిల్లలందరి మధ్య నిలుచొని ఉన్న ఓ చిన్నారిని మీరు గమనించవచ్చు.ఆ తరువాత మెల్లగా ఆ పాప బాక్గ్రౌండ్లో వస్తున్న సంగీతానికి తగ్గట్టు డ్యాన్స్( Dance ) వేయడం స్టార్ట్ చేసింది.
అయితే ఆ స్టెప్పులు సాధారణమైన స్టెప్పులు కాదు.అంత చిన్న వయసులో అంతకుమించిన కాన్ఫిడెన్స్‌తో అలా తన హిప్‌ని కడిలిస్తూ డ్యాన్స్ చేయడం చుపురులని ఆకర్షిస్తోంది.ఇక ఈ వీడియో ఎక్కడ షూట్ చేశారు, ఆ చిన్నారి ఎవరనే విషయాలు తెలియకపోయినప్పటికీ తనను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇక్కడ వీడియో చూసిన నెటిజన్లు ముఖ్యంగా ఆ పాప కాన్ఫిడెన్స్, చిరునవ్వును ఆకాశానికెత్తేస్తున్నారు.వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఆ చిన్నారిలోని టాలెంట్ అత్యద్భుతం అని ప్రశంసిస్తున్నారు.తాను అచ్చం షిన్‌చాన్ కార్టూన్‌లోని టైటిల్ క్యారెక్టర్‌లా ఉందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఇలా తమకు తోచిన విధంగా వీడియోపై స్పందిస్తున్నారు మన నెటిజనం.కాగా ఈ వీడియోకు ఇప్పటివరకు 6 లక్షల 16 వేల లైకులు, 46 లక్షల వీక్షణలు రావడం కొసమెరుపు.
ఇంకెందుకాలస్యం, మీరు ఇక్కడ వీడియోని చూసి మీకు తోచిన కామెంట్ ని కామెంట్ సెక్షన్లో రాయండి మరి.







