'ఆదిపురుష్‌' బిజినెస్‌ లెక్కలు... బాబోయ్ ఇలా కూడా ఉంటుందా?

ప్రభాస్‌( ప్రభాస్‌ ).కృతి సనన్ హీరో హీరోయిన్ గా నటించిన ఆదిపురుష్( Adipurush ) సినిమా విడుదలకు రెడీగా ఉంది.

 Prabhas Adipurush Movie Pre Release Business , Adipurush, Pre Release Business-TeluguStop.com

వచ్చే వారంలో విడుదల కాబోతుంది.జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా పై ఉన్న అంచనాలు భారీగా బిజినెస్ జరిగేలా చేసింది అనడంలో సందేహం లేదు.రూ.550 కోట్ల తో రూపొందిన ఈ సినిమాను తెలుగు లో పంపిణీ హక్కులను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ( People Media Factory )వారు ఏకంగా రూ.185 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి.ఒక వైపు పీపుల్స్ మీడియా వారు తెలుగు లో కొనుగోలు చేసిన మొత్తం షాకింగ్ గా ఉంటే.

వారి నుండి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేస్తున్న మొత్తం మరింత షాకింగ్‌ గా ఉంది.

Telugu Adipurush, Bollywood, Jai Sri Ram, Kriti Sanon, Om Rout, Factory, Prabhas

అన్ని ఏరియాల్లో కలిపి వారు దాదాపుగా రెండు వందల కోట్లకు గాను సినిమా ను పంపిణీ చేసినట్లుగా తెలుస్తోంది.

సినిమా విడుదల అయ్యి లాభాలు దక్కించుకుంటే పీపుల్స్ మీడియా వారికి కనీసం పాతిక నుండి యాబై కోట్లు లాభం దక్కే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆదిపురుష్ యొక్క బిజినెస్ లెక్కలు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇలాగే ఉన్నాయి.

యూఎస్ తో పాటు మొత్తం అన్ని దేశాల్లో కూడా సాధారణ చిత్రాలతో పోల్చితే రెండు లేదా మూడు రెట్లు అధికంగా సినిమా బిజినెస్ చేసింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

Telugu Adipurush, Bollywood, Jai Sri Ram, Kriti Sanon, Om Rout, Factory, Prabhas

థియేట్రికల్‌ రైట్స్ మరియు నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ అన్నీ కలిపి ఏకంగా రూ.600 నుంచి రూ.700 కోట్ల వరకు చేసిందనే వార్తలు వస్తున్నాయి.బాబోయ్ ఈ రేంజ్ లో సినిమా బిజినెస్ చేయడం గతంలో ఎప్పుడు లేదు.కేవలం రాముడి కథ అవ్వడం వల్లే ఈ సినిమా కు ఈ స్థాయి లో బిజినెస్ జరిగిందనే టాక్ వస్తోంది.

సినిమా కు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా రెండు వేల కోట్లు వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube