ఖమ్మం జిల్లా( Khammam District )లో విధి నిర్వహణలో భాగంగా వివిధ ఎన్కౌంటర్లు, బాంబ్ బ్లాస్టింగ్ దుర్ఘటనలో అసువులు బాసిన 20 మంది పోలీస్ కుటుంబాలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక కృషి మేరకు మంజూరైన ఇళ్ళ పట్టాలను ఆయా 20 మంది కుటుంబ సభ్యులకు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదగా పట్టాలను పంపిణీ చేశారు.గత 19ఏళ్ళుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న పోలీస్ అమరుల కుటుంబాల గోస ను అనేక మార్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( Puvvada Ajay Kumar )గారి దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించి మంత్రి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.ఈ మేరకు ఆయా కుటుంబాలకు పట్టాల ద్వారా శాశ్వత పరిష్కారం చూపించారు.తమ చిరకాల స్వప్నం నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఅర్( CM KCR ) గారు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటానికి అమరుల కుటుంబ సభ్యులు క్షీరాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు.పంపిణీ చేసిన వారిలో ఎమ్మెల్సీ తాతా మధు , ఎంపి వద్దిరాజు రవిచంద్ర ( Vaddiraju Ravi chandra ), మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ , జిల్లా కలెక్టర్ VP గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, అదనపు DCP సుభాష్ చంద్ర బోస్ తదితరులు ఉన్నారు.







