శ్రమ దోపిడీకి, వివక్షతకు, గురవుతున్న మహిళలు విముక్తి కై పోరాడాలి: ఐద్వా పిలుపు

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా

రాష్ట్ర స్థాయి జోనల్ క్లాసులు గత మూడు రోజులుగా ఖమ్మం సుందరయ్య భవన్లో జరిగాయి.మూడవరోజు శనివారం నూతన ఆర్థిక విధానాలు మహిళలపై ప్రభావాలు అనే అంశంపై బుగ్గవీటి సరళ గారు మాట్లాడుతూ 1991లో భారతదేశంలో ‌నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాలు పీవీ నరసింహారావు హయాంలో అమలులోకి వచ్చాయని ,వాటి మూలంగా పాశ్చాత్య సంస్కృతిని భారతదేశంలోకి ఆహ్వానించి మహిళలను వ్యాపార వస్తువుగా మార్చారని ఆమె విమర్శించారు .

 Women Who Are Subjected To Labor Exploitation Discrimination Details, Districts-TeluguStop.com

బిజెపి అధికారంలోకి వచ్చాక ఆర్థిక విధానాలను శరవేగంగా అమలు చేస్తూ గతంలో మహిళలు పోరాడి సాధించుకున్న హక్కులను ,చట్టాలను, కూడా కాల రాస్తున్నారని ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంటే, 12 గంటల పని విధానం అమలు చేయాలని మోడీ భారత పార్లమెంటు సాక్షిగా నిర్ణయించారని ఆమె విమర్శించారు.

మోడీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్ .డీజిల్, గ్యాస్, ధరలు విపరీతంగా పెంచి, జీఎస్టీ తెచ్చి పేదల మీద పరోక్ష పన్నులు పెంచి,పరోక్ష పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని రాబట్టి ప్రత్యక్ష పన్నులు కడుతున్న కొద్దిమంది పెటుబడిదారులకు కోట్లాది రూపాయలు సబ్సిడీలు ఇచ్చి వాళ్ళని కుబేరులుగా తయారు చేశాడని ఆమె విమర్శించారు.నేడు వ్యవసాయంలో పనిచేస్తున్న మహిళలకు రక్షణ కల్పించడంలో ,వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో, పాలకులకు చిత్తశుద్ధి లేదన్నారు.

లాభాల్లో ఉన్న పరిశ్రమలన్నింటినీ పారిశ్రామికవేత్తలకు మోడీ అమ్మేశారని ఉపాధి పొందుతున్న మహిళలు, ఉద్యోగాలు లేకుండా వీధిన పడుతున్నారని ఆమె అన్నారు.

ధరల పెరుగుదల వల్ల మొట్టమొదట బలి అయ్యేది సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలే అని ఆమె అన్నారు .ధరల పెరుగుదల వల్ల కుటుంబాలు గడవక పోషక పదార్థాలు అందక 40 శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు .మహిళా రక్షణ కోసం చట్టాలు చేయటంలో అమలు చేయడంలో ప్రభుత్వాలకూ చిత్తశుద్ధి లేదన్నారు.ఇంటా, బయట, శ్రమ చేస్తూ పారిశ్రామిక వ్యవసాయక ఉత్పత్తులకు సహకరిస్తున్న మహిళలకు రక్షణ లేదు అన్నారు.ఆర్థికంగా వెనుకబడిన మహిళలను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన సహాయాలు అందించడం లేదన్నారు.కేంద్ర ప్రభుత్వం అనేకమంది మహిళలు గ్రామాల్లో ఉపాధి పని చేసి ఉపాధి పొందుతుంటే దానికి 2.64 వేల కోట్లు కేటాయించాల్సింది పోయి, గత సంవత్సరం 73 వేల కోట్లు కేటాయిస్తే, ఈ సంవత్సరం 40 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం 63 వేల కోట్లు కేటాయించి ఉపాధిలో 60 శాతం గా పనిచేస్తున్న మహిళలకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు .పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.ఓట్ల కోసం మహిళలను ఉపయోగించుకుంటున్నారని చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడంలో బిజెపికి పూర్తి బలం ఉన్న చిత్తశుద్ధి లేదన్నారు.

మహిళా సాధికారిక కోసం, దోపిడీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని మహిళలకు ఆమె పిలుపునిచ్చారు .

శ్రమ దోపిడీకి గురవుతున్న ఉపాధి మహిళలు అసంఘటిత కార్మిక మహిళలు ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు.కేంద్ర ,రాష్ట్ర, పాలకులు ఆదాయం కోసం మద్యం తెచ్చిఆదాయ వనరుగా మార్చి పేద మహిళల పొట్ట కొడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.మహిళల సమస్యలు పరిష్కారం కావాలంటే సమాజం మారాలని దోపిడీ పోవాలని సమాజ మార్పు కోసం దోపిడీకి వ్యతిరేకంగా జరిగే అన్ని పోరాటాల్లో మహిళల్ని సమీకరించాలని ఆమె పిలుపునిచ్చారు.

ఎన్నో ఆశలతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందని కానీ మహిళలకుఒరిగిందేమీ లేదని గతంలో ఉన్న డ్వాక్రాలో సబ్సిడీలను, కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసిందని ఆమె అన్నారు .రాష్ట్రంలో ఇల్లు ఇళ్ల స్థలాలు లేక కిరాయిలు కట్టలేక అనేక మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారని పేదలందరికీ ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, కేరళ తరహాలో ఉపాధికి 5000 కోట్లు కేటాయించి మునిసిపల్, కార్పొరేషన్ పట్టణాల్లో ఉపాధి పనిని చేయించాలని ఆమె డిమాండ్ చేశారు.

కేరళ తరహాలోనే రేషన్ షాపుల ద్వారా 14రకాల నిత్యావసర వస్తువులను తెల్ల రేషన్ కార్డుదారులకు అందించాలని ఆమె డిమాండ్ చేశారు.మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు.

ప్రభుత్వ ,ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.భృణ హత్యలు నిషేధించాలని, అత్యాచారాలు చేసిన ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని, పబ్బుల అనుమతులను రద్దు చేయాలని, మద్యాన్ని, నిషేధించాలని,మహిళా చట్టాలను రక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈరోజు క్లాస్ కు ఐద్వాజిల్లా కార్యదర్శి మాచర్ల భారతి ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో పాలడుగు ప్రభావతి ,బట్టుపల్లి అనురాధ, రత్నమాల, ప్రమీల ,జయశ్రీ ,ఖమ్మం జిల్లా అధ్యక్షులు బండి పద్మ, ఉపాధ్యక్షులు మెరుగు రమణ, పి ప్రభావతి, పి నాగ సులోచన పాల్గొన్నారు జిల్లా కార్యదర్శి భారతి గారు ఐద్వా తక్షణ కర్తవ్యాలను వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube