ఇంకా పెళ్లి కావాల్సిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ వీరే.. మరి 2023లో అయిన చేసుకుంటారా?

మొన్నటి వరకు మన టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ చాలా మందే ఉన్నారు.అయితే ఈ మధ్య తెలుగు హీరోలంతా ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.

 Most Eligible Bachelors Of Tollywood, Tollywood, Most Eligible Bachelors, Tollyw-TeluguStop.com

తాజాగా శర్వానంద్ పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అవ్వగా.ఇక నిన్న మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీని ఎంగేజ్మెంట్ చేసుకోగా.

బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసి త్వరలోనే పెళ్లి చేసుకోనున్నాడు.మరి ఇలా ఒక్కో హీరో పెళ్లి పీటలు ఎక్కుతున్న తరుణంలో మన టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ( Most Eligible Bachelors )లిస్ట్ ఇంకా ఎంత ఉందో తెలుసుకుందాం.

మన టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టు ఒక్కసారి చుస్తే ముందుగా వినిపించే పేరు ప్రభాస్( Prabhas ).ఈయన ఇప్పటికే 43 ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లి ప్రస్తావన తీసుకు రావడం లేదు.ఎప్పుడు అడిగిన మాట దాటేస్తున్నాడు.ఈయన ఫ్యాన్స్ ఈయన పెళ్లి కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఎంతో మంది అమ్మాయిలు వెయిటింగ్ లో ఉన్న కూడా ప్రభాస్ ఓకే చెప్పడం లేదు.

అలాగే ఈ లిస్టులో రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ ( Ram Pothineni , Vijay Devarakonda )కూడా ఉన్నారు.రామ్ కు 34, విజయ్ కు 33 ఏళ్ళు వచ్చిన పెళ్లి మాట ఎత్తడం లేదు.అలాగే సందీప్ కిషన్( Sandeep Kishan ) 35 ఏళ్ళు దాటినా సినిమాలతో బిజీగా ఉన్నాడు కానీ పెళ్లి విషయం చెప్పడం లేదు.

ఇక మెగా హీరోలు అయిన సాయి ధరమ్ తేజ్ 36, అల్లు శిరీష్ 35 ఏళ్ళు వచ్చాయి.వీరు కూడా పెళ్లి ఊసు ఎత్తడం లేదు.బెల్లంకొండ శ్రీనివాస్ 29, అడవి శేష్ 37, నారా రోహిత్ 38 అక్కినేని హీరోల్లో అఖిల్ 28, సుశాంత్ 36 ఏళ్ళు దాటి పోయాయి.అలాగే లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న తరుణ్ 42 వచ్చిన పెళ్లి చేసుకుంటున్న అనే మాట చెప్పడం లేదు.

మరి వీరిలో ఎవరు 2023లో పెళ్లి పీటలు ఎక్కుతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube