సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో ప్రీతి మృతి కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ సైఫ్ పై వేటు పడింది.ఈ నేపథ్యంలో డాక్టర్ సైఫ్ ను ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ తెలిపారు.
అయితే ప్రీతి మృతికి కారణం అయ్యారంటూ డాక్టర్ సైఫ్ పై చర్యలను ఉపక్రమించారు.కాగా ఇటీవలే ప్రీతి మృతి కేసుపై వరంగల్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఇందులో సైఫ్ వేధించడం వలనే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు ఛార్జ్ షీట్ లో స్పష్టం చేశారు.







