భగవంత్ కేసరి టీజర్ వచ్చేసింది.. మాస్ స్టఫ్ తో నెక్స్ట్ లెవల్లో.. అదిరిందిగా!

నందమూరి నటసింహం బాలకృష్ణ( Actor Balakrishna ) జూన్ 10న అంటే ఈ రోజు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ఈయనకు నిన్నటి నుండే ఫ్యాన్స్ నుండి శుభాకాంక్షల వెల్లువ మొదలైంది.

 Bhagavanth Kesari Teaser Released , Balakrishna, Anil Ravipudi, Bhagavanth Kesar-TeluguStop.com

సోషల్ మీడియాలో ప్రముఖులు, ఫ్యాన్స్ విశేష్ తో సందడి మాములుగా లేదు.ఇదిలా ఉండగా ఈయన ప్రస్తుతం నటిస్తున్న సినిమా నుండి కూడా అదిరిపోయే మరో అప్డేట్ వచ్చింది.

ప్రజెంట్ నందమూరి బాలయ్య అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకే ”భగవంత్ కేసరి”( Bhagwant Kesari ) అనే టైటిల్ ను బర్త్ డే కానుకగా అనౌన్స్ చేసారు.

ఇక ఇక్కడితో ట్రీట్ అయిపోలేదు అని బర్త్ డే రోజు మరో బ్లాస్టింగ్ అప్డేట్ ఉందని మేకర్స్ తెలిపారు.భగవంత్ కేసరి టీజర్ ఈ రోజు రిలీజ్ చేస్తామని నిన్న ప్రకటించి అనుకున్న సమయానికి రిలీజ్ చేసారు.

ఈ టీజర్ బర్త్ డే కు పర్ఫెక్ట్ గిఫ్ట్ అనే చెప్పాలి.భగవంత్ కేసరి టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి.ఈ టీజర్ ను అనిల్ నెక్స్ట్ లెవల్లో కట్ చేసారు.అంతేకాదు బాలయ్య( Balayya ) డైలాగ్ డెలివరీ కూడా కొత్తగా ఉంది.ఇదే ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.బాలయ్యపై యాక్షన్ సీక్వెన్స్ లు అలాగే థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది అనే చెప్పాలి.

మొత్తానికి ఈసారి జాతర మాములుగా ఉండదు అని అర్ధం అవుతుంది.

ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న విషయం విదితమే.అలాగే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తుండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది.

https://youtu.be/6Qh29WWHGe4
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube