టాలీవుడ్ యంగ్ అండ్ కూల్ హీరో శర్వానంద్ ( Sharwanand ) రక్షిత రెడ్డి ( Rakshitha Reddy ) వివాహం జైపూర్ లో జూన్ మూడవ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ వివాహ వేడుకలో తనకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి సెలబ్రిటీలు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
ఇలా జూన్ మూడవ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నటువంటి శర్వానంద్ 9వ తేదీ హైదరాబాద్లో ఎంతో ఘనంగా రిసెప్షన్( Wedding Reception ) ఏర్పాటు చేశారు.ఈ క్రమంలోనే ఈ రిసెప్షన్ వేడుకకు పెద్ద ఎత్తున టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.
ఇలా కన్నుల పండుగగా శర్వానంద్ వివాహ రిసెప్షన్ జరిగిందని చెప్పాలి.

ఇక ఈ వివాహ రిసెప్షన్ వేడుకకు శర్వానంద్ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించిన సంగతి మనకు తెలిసిందే అయితే కేసీఆర్( KCR ) రాకపోయినా ఆయన కుమారుడి కేటీఆర్ ( KTR ) శర్వానంద్ వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు.ఇక ఈ రిసెప్షన్ వేడుకలో రామ్ చరణ్( Ramcharan ) ఉపాసన ( Upasana ) దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.రామ్ చరణ్ శర్వానంద్ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే.
ఇక రామ్ చరణ్ తన పెళ్లి కోసం జైపూర్ కూడా వెళ్లారు.రిసెప్షన్ లో నిండు గర్భిణీ అయినటువంటి తన భార్య ఉపాసనతో కలిసి సందడి చేశారు.
ఇక రామ్ చరణ్ తన భార్య ఉపాసన చేయి పట్టుకొని తనని నడిపిస్తూ తీసుకెళ్లడం అందరిని ఆకట్టుకుంది.

ఇక ఈ వివాహ రిసెప్షన్ వేడుకకు జీవిత రాజశేఖర్ తమ కూతుర్లతో హాజరయ్యారు.అల్లరి నరేష్, నిఖిల్, నితిన్ వారి సతీమణులతో హాజరయ్యారు.దిల్ రాజు దంపతులు కూడా ఈ వివాహ రిసెప్షన్ లో సందడి చేశారు.
నందమూరి బాలకృష్ణ, అక్కినేని అమల, రానా,మంచు లక్ష్మి వంటి ఇతర సినీ సెలబ్రిటీలు కూడా ఈ రిసెప్షన్ వేడుకలు సందడి చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులకు శర్వానంద్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.







