ఇటీవల కార్ల కొనుగోళ్లు( Car purchases ) విపరీతంగా పెరిగిపోతున్నాయి.ఉద్యోగాలు చేసేవారితో పాటు మధ్య తరగతి ప్రజలు కూడా సౌకర్యవంతమైన ప్రయాణం కోసం కార్లు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతన్నారు.
అందుకోసం ఫ్యామిలీకి సరిపోయేలా కార్లు కొనుగోలు చేస్తున్నారు.కొంతమంది ఈఎంఐ పెట్టి కారు తీసుకుంటున్నారు.
ఇక కారు కొనుగోలు చేసేందుకు చాలామంది బ్యాంకుల నుంచి లోన్లు కూడా తీసుకుంటున్నారు.అన్ని బ్యాంకులు కారు లోన్ సౌకర్యం కల్పిస్తున్నాయి.
దీంతో కారు లోన్‌ను తీసుకునేవారి సంఖ్య కూడా పెరుగుతోంది.
అయితే మే నెలలో కార్ల అమ్మకాలు బాగా జరిగాయి.
గత నెలలో అన్ని కంపెనీల కార్ల అమ్మకాల్లో జోరు కొనసాగింది.ప్యాసింజర్ వెహికల్స్ ఎక్కువగా అమ్ముడుపోయాయి.
మే నెలలో ప్యాసింజర్ వెహికల్స్ 334,800 యూనిట్లు నమోదు చేసింది.ఇక మారుతి సుజుకీ ఇండియా( Maruti Suzuki ) మే నెల అమ్మకాల్లో జోష్ కొనసాగించింది.
గత నెలలో ఎక్కువగా అమ్ముడైన టాప్ 10 బెస్ట్ కార్లలో మారుతీ సుజుకీకి సంబంధించి 7 మోడళ్లు ఉన్నాయి.ఇక హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్ కార్లు( Hyundai Motor India, Tata Motors Cars ) కూడా బాగా అమ్మడుపోయాయి.

మురుతి సుజుకీ నుంచి బోలెనో, స్విఫ్ట్, వాగన్ ఆర్, బ్రీజా, ఈసో, డిజ్రీ, ఎర్టిగా ఎస్‌యూవీ కార్లను ఎక్కువగా కొనుగోలు చేశారు.ఇక క్రెటా హ్యుందాయ ఫ్లాగ్ బేరర్, నెక్సన్, టాటా పంచ్ మోడల్ కార్లు కూడా బాగానే అమ్ముడుపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.గత నెలలో బాలెనో మోడల్ కార్లను ఎక్కువమంది కొనుగోలు చేశారు.దాదాపు 18,700 యూనిట్లతో ఎక్కువగా అమ్ముడుపోయిన కార్లలో బాలెనో మోడల్ తొలి స్థానంలో ఉండగా.17,300 యూనిట్లతో స్విఫ్ట్ రెండో స్థానంలో ఉంది.ఇక వ్యాగన్ ఆర్ కారు 16,300 యూనిట్లతో మూడో స్థానంలో ఉంది.







