జార్ఖండ్‌లోని ధన్బాద్లో బొగ్గు గని కుప్పకూలింది.ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
బొగ్గు గని శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే అక్రమంగా బొగ్గు తవ్వకాలు జరుపుతుండగా ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.