బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కామెడీ షో జబర్దస్త్(Jabardasth) కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం చాలామంది కమెడియన్స్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ అనంతరం టీమ్ లీడర్ గా మారి ప్రస్తుతం ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో కెవ్వు కార్తీక్(Kevvu Karthik) ఒకరు.
తాజాగా ఈయన పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు అయ్యారని తెలుస్తుంది.

గత కొద్దిరోజుల క్రితం కెవ్వు కార్తీక్ తనకు కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనని పెళ్లి చేసుకోబోతున్నానని తెలిపారు.అయితే ఎక్కడ కూడా ఆమె ఫేస్ కనపడకుండా జాగ్రత్త పడ్డారు.ఇలా తన జీవితంలోకి రాబోయే అమ్మాయి గురించి ఈ విధంగా హింట్ ఇచ్చినటువంటి కార్తీక్ మరో రెండు రోజులకు ఆ అమ్మాయి ఫేస్ రివిల్ చేస్తూ తన జీవితంలోకి వస్తున్నందుకు తనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక పోస్ట్ చేశారు.
ఇలా తనకు కాబోయే భార్యను పరిచయం చేసినటువంటి ఈయన తాజగా తనతో కలిసి ఏడడుగులు వేశారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈయన పెళ్లి ఫోటోలు (Marriage Photos) ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ వివాహ వేడుకలలో భాగంగా ఎంతో మంది జబర్దస్త్ కమెడియన్స్ అలాగే ఇతర సెలబ్రిటీలు కూడా హాజరయ్యారని తెలుస్తుంది.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి గెటప్ శ్రీను (Getup Srinu)దంపతులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.ఈ క్రమంలోనే వీరితో కలిసి దిగిన ఫోటోని శ్రీను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ కెవ్వు కార్తీక్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా జీవితాంతం ఎంతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.ప్రస్తుతం కార్తీక్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.







