దశాబ్ది ఉత్సవాలలో పాల్గొన్న బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం చెరువుల పండుగను సర్పంచుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం నుండి బతుకమ్మలతో పాటు బోనాలను డప్పు చప్పులతో, బైన్లోల్ల ఆటపాటలతో కళాకారులు నృత్యాలు చేస్తూ గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఊరేగింపుగా ఊరి చివరలో ఉన్న గిద్ద చెరువు కట్ట మైసమ్మ వద్దకు గ్రామస్తులతో వెళ్లారు.

 Brs District President Thota Agaiah Participated In Dashabdi Utsav, Brs , Thota-TeluguStop.com

ఈ చెరువుల పండుగ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య,ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, ఎంపీటీసీలు పందెర్ల నాగరాణి పరశురాం గౌడ్, ఎనగద్దుల అనసూయ నర్సింలు, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, ఉప సర్పంచ్ ఉగ్గు రజిత యాదవ్, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.హరిదాస్ నగర్ గ్రామంలో జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు బోనాల ఉత్సవాలలో పాల్గొని డప్పు చప్పుల మధ్య నృత్యం చేస్తూ అలరించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube