ఒకప్పుడు బిఆర్‌ఎస్ ( BRS )లో కీలక నేతగా ఉన్న ఈటెల ( Etela Rajender )ఆ తరువాత బీజేపీ తీర్థం పుచ్చుకొని ప్రస్తుతం చేరికల కమిటీ చైర్మెన్ గా కొనసాగుతున్నారు.అయితే ఆయనకు పార్టీలో తగిన ప్రదాన్యం లభించడం లేదని, అందుకే అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఆయన కూడా పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు.చేరికల కమిటీ చైర్మెన్ గా పదవిలో ఉన్నప్పటికి ఆయన ద్వారా ఇంతవరకు పెద్దగా చేరికలెవీ జరగలేదు.
అయితే మొదటి నుంచి ఈ పదవి పై అసంతృప్తిగానే ఉన్నఈటెల నామమాత్రంగానే పదవిలో ఉన్నట్లే తెలుస్తోంది.దాంతో ఆయన స్టార్ క్యాంపెయినర్ పదవి( Star campaigner post ) ఆశించినప్పటికి అధిష్టానం అందుకు ఒప్పుకోలేదట.
దాంతో పార్టీలో ఉన్న లేనట్లే అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఈటెల రాజేందర్.

కాగా బిజెపి తీరుపై అసంతృప్తిగా ఉన్న ఈటెల పార్టీ మారతారనే రూమర్స్ పోలిటికల్ సర్కిల్స్ లో తగ సర్కిల్ అయ్యాయి.అయితే ఆ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు ఈటెల రాజేంద్ర.కానీ అంతర్గతంగా మాత్రం ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లే వినికిడి.
అయితే ఈటెల పార్టీ మారితే బిజెపికి పెద్ద దెబ్బ తగులుతుంది.అందుకే ఈటెల ను సంతృప్తి పరిచే దిశగా బిజెపి అధిష్టానం ప్రయత్నాలు మొదలు పెట్టిందట.
ఎందుకంటే కర్నాటక ఎన్నికల్లో ఓటమి తరువాత తెలంగాణలో సత్తా చాటడం బిజెపికి చాలా అవసరం.

అందువల్ల ఈ టైమ్ కీలక నేతలను చేజార్చుకుంటే మొదటికె మోసం వస్తుందనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.అందుకే ఈటెల గతంలో ఆశించిన స్టార్ క్యాంపైనర్ పదవిని కట్టబెట్టేందుకు సిద్దమైనట్లుగా వినికిడి.ఈ మద్య ఈటెల తో బీజేపీ అధిష్టానం తరచూ సమావేశం అవుతోంది.
అద్యక్ష పదవి మార్పు కోసమే ఈటెలతో అడిష్టానం సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నప్పటీకి అలాంటిదేమీ లేదని తేల్చి చెబుతున్నాయి బీజేపీ వర్గాలు.దాంతో మరో కీలక పదవి అనగా ( స్టార్ క్యాంపైనర్ ) అప్పగించేందుకే ఈటెల తో చర్చలని తాజాగా అందుతున్న సమాచారం.
ఒకవేళ ఈటెలను స్టార్ క్యాంపైనర్ చేస్తే ఆయన అలక తీరినట్లేనని, ఇకపై ఫుల్ యాక్టివ్ గా పని చేసే అవకాశం ఉందని పోలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్నా చర్చ.మరి ఈటెల విషయంలో అధిష్టానం ఏం చేయబోతుందో చూడాలి.







