యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్( Adipurush ) సినిమా వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.రికార్డు స్థాయి వసూళ్లను ఆదిపురుష్ సినిమా వసూళ్లు చేయబోతున్నట్లుగా అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా యొక్క కలెక్షన్స్ ఎలా ఉన్నా కూడా కచ్చితంగా ముందు ముందు ఆయన సినిమాలకు ఈ సినిమా కలిసి వస్తుంది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆదిపురుష్ సినిమా తో పాటు ప్రభాస్ చేస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి.

అందులో ప్రభాస్( Prabhas ) అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురు చూస్తున్న చిత్రం ‘సలార్’( Salar ).కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ( Prashanth Neil )దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమా ను ఈ ఏడాది లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సలార్ సినిమా కేజీఎఫ్ ను మించిన సినిమా అవుతుందని.వెయ్యి కోట్లకు మించి వసూళ్లు చేస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాదిలో ఆదిపురుష్ మరియు సలార్ సినిమాలు విడుదల కాబోతుండగా.

వచ్చే ఏడాది ప్రభాస్ నుండి మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా డీలక్స్ సినిమా తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ప్రభాస్ ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాను అంటూ ఇటీవలే ఫ్యాన్స్ కు హామీ ఇచ్చిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న అన్ని సినిమాలతో పాటు బాలీవుడ్ లో సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమాను ప్రభాస్ చేయబోతున్నాడు.
హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయి.ప్రభాస్ సినిమాల యొక్క జాతర జూన్ 16 నుండి ప్రారంభం కాబోతుంది.ముందు ముందు ఈ జాతర ఓ రేంజ్ లో ఉండబోతుంది.







