ప్రభాస్ ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్( Adipurush ) మూవీ రిలీజ్ కు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది.ఆదిపురుష్ మూవీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.
దాదాపుగా మూడు గంటల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.మైథలాజికల్ మూవీ మూడు గంటల నిడివి అంటే ఒకింత ఎక్కువ నిడివితోనే ఈ సినిమా విడుదల కానుంది.
సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో సెన్సార్ సభ్యులకు ఈ స్థాయిలో నచ్చిన సినిమా మరొకటి లేదని బోగట్టా.చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ మెప్పించే విధంగా ఈ సినిమా ఉండనుందని ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆ బడ్జెట్ కు న్యాయం చేసేలా ఉందని సమాచారం అందుతోంది.

ఆదిపురుష్ సెన్సార్ ( Adipurush censor )రివ్యూ పాజిటివ్ గా ఉండటంతో ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.యాక్షన్ సీక్వెన్స్ లు ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తీసిన ఆ సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.ఆదిపురుష్ సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని సమాచారం.ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ కూడా లేదనే సంగతి తెలిసిందే.
ఆదిపురుష్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా కానుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆదిపురుష్ మూవీలో బాలీవుడ్ ( Bollywood )నటీనటులకు ఎక్కువగా ప్రాధాన్యత దక్కింది.
ఆదిపురుష్ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.స్టార్ హీరో ప్రభాస్ కోరుకున్న సక్సెస్ ఈ సినిమాతో దక్కుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.