విజయవాడ: ఎ.కొండూరు మండలంలో పలు గ్రామాలకు తాగునీటి సరఫరా ట్యాంకర్లు పంపిణీ చేసిన ఎంపీ కేశినేని నాని.
కిడ్నీ బాధిత ప్రాంతాలకు 17 ట్యాంకర్లు పంపిణీ.కేశినేని నాని కామెంట్స్…పార్లమెంట్ పరిధిలో ఎంపీ నిధులతో తాగునీటి సమస్యపై దృష్టి పెట్టాం.
టీడీపీలో నాకు ఏ పదవీ లేదు…నేను అధికార ప్రతినిధి ని కాదు…నేను అన్ని పార్టీలతో టచ్ లో ఉంటాను…బీజేపీ,వైసీపీ,కాంగ్రెస్,వామపక్షాలతో కూడా టచ్ లో ఉంటాను.కొంతమంది ఏం చేసినా మెచ్చుకునే వారు ఉంటారు.
గిట్టని వారు ఉంటారు.నేను పార్టీల తరపున కార్యక్రమాలు చేయడం లేదు.
ప్రజల తరపున చేస్తున్నాను.నియోజకవర్గాల ఇంఛార్జీలు గొట్టం గాళ్ళు.
వాళ్లేమీ కాంస్టిట్యూషన్ కాదు.రాజ్యాంగ పదవులు కాదు.విజయవాడ సెంట్రల్ లో పార్టీ ఆఫీస్ ప్రారంభానికి అచ్చెన్నాయుడు వచ్చాడు.నన్ను పిలవకుండా ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇచ్చారు.
మహానాడుకు నన్నెవరూ పిలవలేదు రామ్మోహన్ నాయుడుకు తప్ప నా పాత్ర లేదన్నారు.అమిత్ షా తో చంద్రబాబు ఏం మాట్లాడారో నాకు తెలియదు…వాళ్ళ పీఏ ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళాను.
వైసీపీ వాళ్ళు నన్ను ఆహ్వానిస్తున్నారు అంటే నేను మాంచివాడిననే కదా.పొమ్మనలేక పొగబెట్టి…నాకు హీట్ తగిలితే అప్పుడు ఆలొచ్చిస్తాను.చంద్రబాబు పిలిస్తే వెళ్లి మాట్లాడతాను…నేను వెళ్లి ఏమీ చెప్పను.