నిజానికి ఏ ఎన్నికల లో నైనా కొద్ది నెలల ముందే ప్రజలు మూడ్ ఎటు వుందో మీడియా పసిగడుతుంది.ఓటర్లు ఏ వైపున పోలరైజ్ అవుతున్నారు, ఏ పార్టీకి అనుకూలంగా వాతావరణ మారుతుంది అన్న విషయం ఎన్నికలకు ముందే ఒక అంచనా కనిపిస్తుంది, అయితే ఈసారి తెలంగాణ( Telangana ) ఎన్నికలలో ఆ వాతావరణం కనిపించడం లేదట, రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్న బారసా పార్టీ ఒకవైపు, కర్ణాటక ఎన్నికల ఫలితాలతో జోష్ వచ్చిన కాంగ్రెస్( Congress ) నూతన ఉత్సాహంతో అధికారం దిశగా వ్యూహాలు పన్నుతుంటే మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలతో కాస్త డీలా పడినప్పటికీ బిజెపి కూడా అధికారం మాదే అంటూ జబ్బులు చరుచుకుంటుంది .

అయితే తెలంగాణ ఓటర్ ఏ పార్టీ అనుకూలంగా ఉన్నారన్నవిషయం మాత్రం అంతు చిక్కడం లేదట.భారాసా పై వ్యతిరేకత అయితే ఉంది.నిజానికి రెండుసార్లు పరిపాలించిన ఏ పార్టీ పై అయినా వ్యతిరేకత సహజమే.అయితే తన సాగునీటి, తాగునీటి పథకాల ద్వారా తెలంగాణ వ్యవసాయ రంగానికి పూర్తిస్థాయిలో నిరందించిన కేసీఆర్ ( KCR )పట్ల గ్రామీణ పల్లెలలో అనుకూల వాతావరణం కనిపిస్తుంది.
ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ గోడు పట్టించుకోలేదని ,కేసీఆర్ వచ్చిన తర్వాత మౌలిక వసతులు ,సాగునీటి పథకాల పట్ల చిత్తశుద్ధితో పనిచేశారు కాబట్టి కృతజ్ఞత తీర్చుకోవాలనే భావన ఆయా వర్గాల నుంచి వినిపిస్తుంది .అయితే పట్టణ ప్రాంతాలలో మాత్రం బారాస పట్ల వ్యతిరేకత ఉంది అంటున్నారు.ఆయా వర్గాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయి అయితే కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందా లేదా అన్న అనుమానాలు ఒకపక్క.ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలు ఆగిపోతాయేమోనని భయం మరోపక్క వేదిస్తుండడం తో తెలంగాణ ఓటరు ఎటువైపు నిలబడలో తెలియని సందిగ్ధ వాతావరణం లో ఉన్నారని విశ్లేషణలు వస్తున్నాయి.

మరొకపక్క బారాసకు ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకున్న భాజపా మునుగోడు ఎన్నికల తర్వాత చాలా వెనకబడిందని చెబుతున్నారు.నేతల మధ్య కూడా ఐక్యత లేకపోవడం, పార్టీని గెలుపు తీరాలకు చేర్చాలని ఉత్సాహం పార్టీ అధ్యక్షుడి లో కూడా కనిపించకపోవడం మైనస్ గా మారింది అంటున్నారు .ఎంత ప్రయత్నించినా కూడా కీలకమైన నేతలను పార్టీలోకి చేర్చుకోలేకపోవటం ఆ పార్టీకి ఎదురు దెబ్బగా మారింది.ముక్కోణపు పోటీ అంటూ జరిగితే తప్పనిసరిగా తమదే విజయమని భావించిన బారసా క్రమంగా బిజెపి థర్డ్ ప్లేస్ లోకి వెళ్లి కాంగ్రెస్ పుంజుకోవడంతో కాంగ్రెస్ బలం గా మారితే తమకు ఇబ్బంది తప్పదని భావిస్తున్న బారసా నేతలు కాంగ్రెస్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు.
తమ విమర్శలు అన్ని కాంగ్రెస్ కేంద్రంగానే ఉండేలా చూసుకుంటున్నారు మరి తెలంగాణ ఓటర్ ఎటువైపు ఉన్నాడు అన్నది మరికొన్ని రోజుల్లో ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.







