పెద్దలు కష్టే ఫలి అని చెబుతూ ఉంటారు.మనం కష్టపడితే ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు ఆ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.
మనం ఎంత కష్టపడితే అదే స్థాయిలో సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు.ఒక తెలుగు మహిళ చదివింది ఎనిమిదో తరగతి మాత్రమే అయినా ఐఏఎస్ లకు పాఠాలు చెప్పే స్థాయికి ఎదగడం గమనార్హం.
ఆ మహిళ పేరు ఉప్పునూతుల శోభారాణి.( Sobha Rani ) ఈ మహిళ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది.
పేద కుటుంబంలో పుట్టిన శోభారాణి తల్లీదండ్రుల కష్టాన్ని చూస్తూ పెరిగారు.తల్లీదండ్రులు ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివించగా పై చదువులు చదవాలనే కోరిక ఉన్నా శోభారాణి మాత్రం కొంతకాలం పాటు పైచదువులు చదవలేకపోయారు.14 సంవత్సరాల వయస్సులోనే శోభారాణికి పెళ్లి కాగా భర్త సొంతంగా చిన్న సైకిల్ షాప్ నిర్వహించేవారు.అయితే భర్తను ఒప్పించి పది పరీక్షలు రాసిన శోభారాణి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు.
శోభారాణి భర్తది మహబూబాబాద్ లోని బొల్లెపల్లి కాగా తర్వాత రోజుల్లో శోభారాణి భర్తతో కలిసి వరంగల్ జిల్లా( Warangal ) జాన్ పాకకు వచ్చారు.ఆ తర్వాత స్వయం సహాయక సంఘాలలో చేరిన శోభారాణి రిసోర్స్ పర్సన్ గా కెరీర్ ను మొదలుపెట్టారు.అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడటంతో శోభారాణిని అధికారులు సైతం ప్రోత్సహించారు.తర్వాత రోజుల్లో శోభారాణి హిందీలో మాట్లాడటం కూడా నేర్చుకున్నారు.
తన మాట తీరుతో శోభారాణి 20 రాష్ట్రాలలో వేల మందికి పొదుపు పాఠాలను నేర్పారు.శోభారాణి ప్రతిభను గమనించిన అధికారులు ముస్సోరిలో ట్రైనింగ్ తీసుకుంటున్న ఐఏఎస్ లకు( IAS ) పొదుపు సంఘాల గురించి చెప్పే ఛాన్స్ ను కల్పించగా శోభారాణి చెప్పే విధానాన్ని చూసి ట్రైనీ ఐఏఎస్ లు సైతం ఆమెను ఎంతగానో అభినందించడం గమనార్హం.తర్వాత రోజుల్లో బీఏ, ఎం.ఎ రూరల్ డెవలప్మెంట్ లో పీజీ చేసిన శోభారాణి తన కొడుకులను బీటెక్ చదివిస్తున్నారు.పొదుపు సంఘాలలో మహిళలు సాధించిన విజయాల గురించి గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి శోభారాణి మాత్రమే ఎంపిక కాగా మంత్రి గిరిరాజ్ సింగ్ తనను ప్రశంసించారని ఆమె చెప్పుకొచ్చారు.