యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ పట్టణంలోని 236 సర్వే నంబర్ 236, 237 లో 1996వ సంత్సరంలో బెదరకోట యాదగిరి తండ్రి చంద్రయ్య భూమిని కొనుగోలు చేశారని,పట్టా పాస్ బుక్కులు సైతం పొందారని,కానీ, కొంతమంది రియల్ దళారులు నకిలీ పత్రాలను సృష్టించి ప్లాట్లుగా చేసి అమాయకులకు అంటగట్టారని బహుజన్ సమాజ్ పార్టీ మునుగోడు నియోజకవర్గ నాయకులు పెండెం ధనుంజయ్ నేత( Pendem Dhanunjay Neta ) అన్నారు.బుధవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ చౌటుప్పల్ నడిబొడ్డున ఉన్న సర్వే నెంబర్ 236,237లో బెదరకోట యాదగిరి మరియు తాటి రామచంద్రం లకు చెందిన మూడు ఎకరాల భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కొందరు రాజకీయ పలుకుబడితో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు దాన్ని ప్లాట్లు చేసి అమ్ముకొని అసలు పట్టాదారులను ఆ భూమి లోకి రాకుండా బెదిరించి వాళ్లకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.15 ఏళ్లుగా బాధితులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అసలు పట్టాదారులకు న్యాయం జరగలేదన్నారు.ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తామని, బాధితులకు న్యాయం జరిగేంతవరకు వారి కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు.తెలియజేశారు.
బాధితుడు యాదగిరి మాట్లడుతూ ఈ విషయమై గతంలో పలుమార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని, అధికారులు సమగ్ర విచారణ జరిపి దళితుడినైన నాకు న్యాయం చేయాలని కోరారు.అనంతరం తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.







