మొక్కజొన్న సేకరణలో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

మొక్కజొన్న సేకరణలో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.

 The Speed Of Corn Collection Should Be Increased And Completed Quickly.. Distric-TeluguStop.com

గౌతమ్ ( V.P.Gautham )అన్నారు.మంగళవారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు, మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రతిపాదించిన 44 మొక్కజొన్న కేంద్రాలకు గాను, 37 కేంద్రాలు ఇప్పటికి ప్రారంభించినట్లు తెలిపారు.

34 కేంద్రాలలో కొనుగోళ్లు జరిగినట్లు ఆయన అన్నారు.ఇప్పటి వరకు 9167 మంది రైతుల నుండి రూ.107 కోట్ల 65 లక్షల విలువ గల 54868.753 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు ఆయన అన్నారు. కేంద్రాల్లో సేకరించిన మొక్కజొన్న వెంటనే నిల్వ గిడ్డంగులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

లారీల సంఖ్య, హమాలీల సంఖ్య పెంచాలన్నారు.మొక్కజొన్నల దిగుబడిని బట్టి కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులు ముందస్తుగా ఇండెంట్ చేసుకోవాలని, రైతులకు( Farmers ) ఏ దశలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్( N.Madhusudan ), డిసిఓ విజయ కుమారి, డిఎం మార్క్ ఫెడ్ సునీత, అధికారులు, ట్రాన్స్పోర్టర్లు తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube