ఏ సినిమా బిజినెస్ అయిన నైజాం లో( Nizam ) ముందుగా దిల్ రాజు వద్దకే వెళుతుంది.ఆయన కాస్త వెనకడుగు వేసిన సినిమాలే వేరే వాళ్ళ చేతికి చిక్కుతాయి.
అందుకే నైజాం బిజినెస్ అంటే దిల్ రాజు పేరునే వినిపిస్తుంది.కానీ ఈసారి భారీ బడ్జెట్ సినిమా అయిన కూడా దిల్ రాజు ముందుకు రాలేదు.
అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) నటించిన ఆదిపురుష్ ( Adipurush ) సినిమాకు దిల్ రాజు వెనకడుగు వేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఏది ఏమైనా దిల్ రాజు వదిలేసుకున్న ఆదిపురుష్ నైజాం రైట్స్ ను మైత్రి మూవీస్ డిస్టిబ్యూషన్ సంస్థ చేతికి చిక్కాయి.
ఈ సంస్థ ఆదిపురుష్ నైజాం రైట్స్ ను 60 కోట్ల భారీ ధరకు డీల్ క్లోజ్ చేసింది.అందులో 10 కోట్లు రికవరబుల్ అడ్వాన్స్, 50 కోట్లు నాన్ రికవరబుల్ అడ్వాన్స్ కు డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మైథలాజికల్ మూవీగా ఇతిహాస గ్రంథం రామాయణం ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే.మరి ఇలాంటి సినిమాలకు ఇంత డీల్ సెట్ అయ్యింది అంటే ఇది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.ఇక నైజాంలో మాత్రమే కాదు ఆంధ్రాలో చాలా ఏరియాల్లో బిజినెస్ క్లోజ్ చేసారు.

కొన్ని ఏరియాల్లో ఇంకా బిజినెస్ పెండింగ్ లో ఉందట.విశాఖ, సీడెడ్ వంటివి పెండింగ్ లో ఉన్నాయి.ఆంధ్ర 70, నైజాం 60 రేషియోలో కట్ చేయగా సీడెడ్ 25 వేసుకోగా మొత్తంగా 155 కోట్లు వెనక్కి వచ్చాయి.
పీపుల్స్ మీడియా ఈ సినిమా హక్కులను 160 కోట్లకు తీసుకోగా 155 కోట్లు వచ్చాయి.మరి రిలీజ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి.







