ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్( Mahindra Group ) ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే.సోషల్ మీడియాలో సామాజిక, రాజకీయ అంశాలతో పాటు వైరల్ వీడియోలపై స్పందిస్తూ ఉంటారు.
అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో కూడా ఆనంద్ మహీంద్రా పాల్గొంటూ ఉంటారు.ఆపదలో ఉన్నవారికి తమవంతు సహాయం చేస్తూ ఉంటారు.
వినూత్న ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలపై ఆయన ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు.కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ తనవంతు సాయం చేస్తూ ఉంటారు.

తాజాగా ఫోల్డబుల్ ఇంటి( foldable house ) గురించి ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు.ఒక అమెరికన్ హౌసింగ్ నిర్మాణ సంస్థ దీనిని రూపొందించింది.400 చదరపు అడుగులు ఉండే ఈ ఇంటిని కనెక్టర్ ప్లేట్స్ ఉపయోగించి ఒకచోట నుంచి మరొక చోటుకు మార్చుకోవచ్చు.భారత కరెన్సీలో దీని ధర రూ.40,00,000గా ఉంది.అలాగే ఈ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
పికప్ ట్రక్కును ఉపయోగించి ఈ ట్రక్కును ఎక్కడికి కావాలంటే అక్కడకు మార్చుకోవచ్చు.ఈ మోడల్ ఆనంద్ మహీంద్రాకు తెగ నచ్చేయడంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు.

తక్కువ ఖర్చుతో ఇంటిని ఎలా నిర్మించుకోవాలనేది మనం అన్వేషిస్తూ ఉండాలని, ఈ ఇంటిని అద్భుతంగా భావిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా తెలిపారు.ఇండియాలో ఇల్లు కట్టుకోవడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, తక్కువ ఖర్చుతో ఇంటిని ఎలా కట్టుకోవాలనేది కూడా ఆన్వేషించాలని పేర్కొన్నారు.ఈ వీడియో తనను చాలా ఆకర్షించిందని, ఇలాంటి ఆవిష్కరణలు ఇండియాలో కూడా రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.అయితే ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు.ఇండియాలో జనాభా బాగా ఎక్కువగా ఉంటుందని, ఇలాంటివి ఉపయోగపడకపోవచ్చని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.ఈ ఇంటి కోసం ఎక్కువ స్థలం అవసరమవుతుందని అంటున్నారు.







