కొన్ని సినిమాల కథా, కథనం అన్నీ బాగానే ఉన్నా., ఎందుకో ప్లాప్ అయిపోతుంటాయి.
మిగతా అందరి హీరోలకి ఇలాంటి పరిస్థితి చాలా సార్లే ఎదురై ఉంటుంది.కానీ.
, విక్టరీ వెంకటేష్ సినిమాలు అంత సులభంగా ప్లాప్ అవ్వవు.కథా, కథనం బాగుంటే అస్సలు హిట్ కాకుండా పోయే ప్రసక్తే లేదని అందరి నమ్మకం.
అయితే., కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2001లో విడుదలైన ‘దేవి పుత్రుడు’ మూవీ ఈ నమ్మకాన్ని వమ్ము చేసింది.
వెంకటేష్ కెరీర్ లోనే ఈ మూవీ డిజాస్టర్ గా మారిపోయింది.నిజానికి ఈరోజుకి కూడా ‘దేవి పుత్రుడు’ మూవీ అద్భుతంగా అనిపిస్తోంది.
మరి., అలాంటి సినిమా ఎందుకు ప్లాప్ అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.కోడి రామకృష్ణ అంటే గ్రాఫిక్స్ కి పెట్టింది పేరు.అప్పటికే ఆయన అమ్మోరు మూవీతో అద్భుతాన్ని సృష్టించి ఉన్నాడు.దేవి పుత్రుడుకి కూడా కథ రీత్యా ఇలాంటి గ్రాఫిక్స్ అవసరం అయ్యింది.ఎం ఎస్ రాజు వెనకడుగు వెయ్యకుండా డబ్భులు ఖర్చు పెట్టేశారు.
అంత్యంత సాంకేతిక విలువలతో , గ్రాఫిక్స్ తో ఓ మంచి సినిమా సిద్ధమైంది.టోటల్ బడ్జెట్ అప్పట్లోనే దాదాపు 15కోట్ల రూపాయలకి చేరింది.
అప్పుడు వెంకటేశ్, సౌందర్య కాంబోకి ఉన్న క్రేజ్ కారణంగా ‘దేవి పుత్రుడు’ మూవీ 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.అంటే నిర్మాతకి రూ.3 కోట్ల టేబుల్ ప్రాఫిట్ అనమాట.

2001సంక్రాంతి కానుకగా ‘దేవిపుత్రుడు’ విడుదల అయ్యింది.తొలిరోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా.కానీ.
, గ్రాఫిక్స్ అదిరిపోయాయని ప్రేక్షకులు మెచ్చుకున్నారు.మణిశర్మ అందించిన మ్యూజిక్ కూడా వర్క్ అవుట్ అయ్యింది.
కాకుంటే మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చినా., లాంగ్ రన్ కొట్టలేకపోయింది.
కేవలం 8కోట్లు షేర్ మాత్రమే బయ్యర్స్ కి రిటర్న్ అయ్యింది.ఆరోజుల్లోనే రూ.10 కోట్ల రూపాయల నష్టం.చిన్నపిల్ల, గ్రాఫిక్స్, సముద్రంలో మునిగిన ద్వారకా ఇలా అన్నీ ఆకట్టుకునేలా ఉన్నా, బొమ్మ బోల్తా పడిపోయింది.
కేవలం 8 కోట్లు మాత్రమే షేర్ వచ్చించి.దీనితో నిర్మాత రాజు డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేశాడు.
ఫలితం ఆయన కూడా నష్టాల్లో పడిపోయారు.అయితే.
, ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకే గుజరాత్ లో భూకంపం వచ్చి చాలా మంది చనిపోయారు.నిజానికి ‘దేవి పుత్రుడు’ తరువాత నిర్మాత ఎం.ఎస్.రాజు రూ.25 కోట్ల పెట్టి వెంకటేష్ తో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు.అయితే దీని ఫలితం రివర్స్ అయ్యేసరికి ఎం ఎస్ రాజు ఆలోచన కూడా మారిపోయింది.
కేవలం గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమాలో కథ మార్చుకోవాల్సి వచ్చింది.కథ మారిపోవడంతో ఫలితం తేడా కొట్టేసింది.
ఒరిజనల్ కథతో తీస్తే పదేళ్లు పడుతుందని స్వయంగా ఎంఎస్ రాజు చెప్పడాన్ని బట్టి ఈ సినిమా కథలో ఎన్ని మార్పులు చేశారో అర్ధం చేసుకోవచ్చు.పైగా.
, అదే సమయంలో విడుదలైన ‘నరసింహనాయుడు’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ‘దేవిపుత్రుడు’ ప్రేక్షకులను ఆకట్టుకోలేక ప్లాప్ మూవీగా మిగిలిపోయింది.