రేపు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) పోలవరం ప్రాజెక్ట్ సందర్శించనున్నారు.

రెండు కాఫర్ డ్యాం లతో పాటు కుంగిపోయిన డయాఫ్రం వాల్ ను ఆయన పరిశీలించనున్నారని రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ రామ్( Bharat Margani ) వెల్లడించారు.

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనాలోచిత నిర్ణయాల వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిందని స్పష్టం చేసారు.గోదావరి వరదల సమయంలో నీటి ప్రవాహ వేగానికి ఎగువ దిగువ కాఫర్ డ్యాం ల మధ్య భారీ గుంతలు ఏర్పడ్డాయని తెలిపారు.

ఆ గుంతలను పూడ్చడానికి లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలిస్తున్నామన్నారు.పనులు జరుగుతున్న తీరును సిఎం పరిశీలించిన అనంతరం కేంద్రం నుంచి నిధులు విడుదలవుతాయన్నారు ఎంపి భరత్.

వేసవి తాగు నీటి ఎద్దడి దృష్ట్యా రాజమండ్రి పార్లమెంట్ పరధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు వాటర్ ట్యాంకర్లను సమకూర్చారాయన.రాజమండ్రి దేవి చౌక్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించిన అనంతరం వాటిని ఆయా నియోజకవర్గాలకు తరలించారు.

Advertisement
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ..!!

తాజా వార్తలు