మహిళా రెజ్లర్ల పై లైంగిక వేదింపులు అమానుషం

నిదితున్ని కఠినంగా శిక్షించాలి
బిజేపి ఎంపి బ్రిజ్ భూషణ్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలి
బిజెపి హయాంలో మహిళ కు రక్షణ లేదు
మహిళా అంటే అంత చిన్న చూపా
బిజెపి ప్రభుత్వ తీరు దారుణం
నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్
నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

 Sexual Harassment Of Female Wrestlers Is Inhumane Details, Indian Wrestling Fede-TeluguStop.com

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్( Brij Bhushan Saran Singh ) పై కఠిన చర్యలు తీసుకోవాలని పోరాడుతున్న రెజ్లర్లకు మద్దతుగా నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జెడ్పీ సెంటర్ లో గల అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.

మహిళా రెజ్లర్లపై( female wrestlers ) లైంగిక దోపిడీకి పాల్ప‌డిన బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మాత్రమే కాకుండా, అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మహిళా మల్లయోధుల ఈ పోరాటానికి మద్దతుగా అన్ని సామాజిక సంస్థలు, మహిళా సంఘాలు, మానవహక్కుల సంస్థలు, విద్యార్థులు-యువత, ప్రజలు ముఖ్యంగా అన్ని తరగతులు, వర్గాల మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వ పితృస్వామ్య దురహంకారపు మహిళా వ్యతిరేక వైఖరిని బట్టబయలు చేస్తూ, మల్లయోధుల పోరాటానికి మద్దతు తెలుపుతూ, సమావేశాలు నిర్వహించాలని, అన్నారు ఈ ఏడాది జనవరి 18న మొదటిసారిగా, లైంగిక వేధింపులకు గురైన మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్ దుశ్చర్యలపై చర్య తీసుకోవడానికి జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు.ఆపై దర్యాప్తు కోసం క్రీడా మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది, అయితే ఆ కమిటీ బ్రిజ్ భూషణ్ సింగ్ అకృత్యాలను కప్పిపుచ్చింది.

మూడు నెలలుగా దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కానీ ఈ రెజ్లర్లకు, వారి కుటుంబ సభ్యులకు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి.ఇంత జరిగినా, వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నారు.

ఇది ప్రశంసనీయమైనది.

మణిపూర్‌లో క్రీడా మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు తమకు ఎదురైన కష్టాలను విలేకరులకు చెప్పారు.

అయితే మోడీ క్రీడా మంత్రుల సమావేశంలో తమ‌ ఎంపీపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై విచారణ గురించి కానీ, మహిళా క్రీడాకారులపై జరిగిన అఘాయిత్యాల గురించి కానీ ఏమీ మాట్లాడలేదు.

ఇలాంటి సున్నితమైన అంశంపై బీజేపీ మౌనం వహించడానికి కారణం వారి మహిళా వ్యతిరేక మనువాద ఆలోచనే.

నిజానికి కేంద్రంలో రెండోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మహిళలపై రకరకాల అఘాయిత్యాలు పెరిగిపోయాయి.ఇది యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదు.

దేశాన్ని హిందూ దేశంగా మార్చాలనే లక్ష్యంతో బీజేపీ, సంఘ్ పరివార్ కలిసి చేస్తున్న కుట్రల‌ ఫలితం.వీళ్ళు కుల ఆధారిత, పితృస్వామ్య సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నారు.

ఒకవైపు స్త్రీలను భోగ వస్తువులుగా, సరుకులుగా చూపిస్తూ పురుషులకు బానిసలుగా జీవించే సంస్కృతిని వ్యాప్తి చేస్తూనే మరోవైపు స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న స్త్రీలపై విషం చిమ్ముతున్నారు.మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి అనేక కేసులు నమోదైన తర్వాత కూడా ప్రభుత్వం,పాలనా యంత్రాంగం పూర్తి సహాయంతో బిజెపికి చెందిన చాలా మంది ఎంపిలు, ఎమ్మెల్యేలను కోర్టులు నిర్దోషులుగా విడుదల చేస్తున్నాయి.ప్రస్తుతం ఇందుకు చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి.

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోను( Bilkis Banonu ) చిత్రహింసలకు గురి చేసి అత్యాచారం చేసి ఆమె కుటుంబ సభ్యులను ఆరుగురిని హత్య చేసిన 11 మందిపైనేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధించబడినప్పటికీ 2022లో గుజరాత్ ప్రభుత్వం వారిని జైలు నుండి విడుదల చేసింది.ఇదంతా గుజరాత్ బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే జరిగింది.ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత బాలిక మనీషాను దారుణంగా హింసించి చంపిన నలుగురు అగ్రవర్ణాల ఠాకూర్ యువకుల్లో ముగ్గురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

దేశంలోని శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు బ్రాహ్మణ ఆధిపత్య హిందూత్వ శక్తులతో నిండిపోయాయి.దీని కారణంగా దళితులు, గిరిజనులు, పేద వర్గాలకు చెందిన వారు ప్రతిరోజూ దేశంలోని మతవాదుల చేతుల్లో హత్యలకు గురవుతున్నారు.

భౌతిక, లైంగిక వేధింపులు, సాంస్కృతిక దాడులు, మైనారిటీలపై ముఖ్యంగా ముస్లిం మహిళలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి.మరోవైపు స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న స్త్రీలపై విషం చిమ్ముతున్నారు.మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి అనేక కేసులు నమోదైన తర్వాత కూడా ప్రభుత్వం,పాలనా యంత్రాంగం పూర్తి సహాయంతో బిజెపికి చెందిన చాలా మంది ఎంపిలు, ఎమ్మెల్యేలను కోర్టులు నిర్దోషులుగా విడుదల చేస్తున్నాయి.ప్రస్తుతం ఇందుకు చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి.

దీని కారణంగా దళితులు, గిరిజనులు, పేద వర్గాలకు చెందిన వారు ప్రతిరోజూ దేశంలోని మతవాదుల చేతుల్లో హత్యలకు గురవుతున్నారు.భౌతిక, లైంగిక వేధింపులు, సాంస్కృతిక దాడులు, మైనారిటీలపై ముఖ్యంగా ముస్లిం మహిళలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి.

ఇలాంటి సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో మహిళా రెజ్లర్ల‌ పోరాటం నిరంకుశ, గూండాలు, బ్రిజ్‌భూషణ్‌ వంటి పురుషాధిక్య పార్లమెంటేరియన్లపైనే కాకుండా హిందూ దేశాన్ని ఏర్పాటు చేయాలనే కుట్రలకు వ్యతిరేకంగా ఉండాలి.కుస్తీలోనే కాదు అన్ని క్రీడల్లోనూ పితృస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా మహిళా క్రీడాకారులు గళం విప్పాలి.

మహిళా వ్యతిరేకులుగా మారిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేరస్వభావాలున్న యావత్‌ ప్రభుత్వ యంత్రాంగంపై పోరాటం చేయడం అందరి కర్తవ్యం.దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దోపిడీ, దౌర్జన్యాలు, దాడులకు వ్యతిరేకంగా ధైర్యంగా, దృఢ సంకల్పంతో పోరాడాలని చెప్పారు అన్ని తరగతుల, వర్గాల, ప్రాంతాల మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు

*మహిళా క్రీడాకారులకు, వారి కుటుంబాలకు పూర్తి భద్రత కల్పించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి!
*ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, నిరంకుశ బీజేపీ ఎంపీ బిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను కఠినంగా శిక్షించాలి! అని నినదించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు లాకవత్ సైదులు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు, మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రబ్బానీ, మారం కరుణాకర్ రెడ్డి, భూక్యా బాలాజీ, కొంటేముక్కుల నాగేశ్వరరావు, ఏలూరి రవికుమార్,మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు ముజాహిద్ హుస్సేన్,సిటీ ఎస్టీ సెల్ అధ్యక్షులు దేవత్ శంకర్ నాయక్, మైనారిటీ సెల్ నగర అధ్యక్షుడు అబ్బాస్ బేగ్ , బీసి సెల్ నగర అధ్యక్షుడు సిటీ సేవాదల్ అధ్యక్షులు సయ్యద్ గౌజ్, డివిజన్ అధ్యక్షులు, సాదే శంకర్, బండి నాగేశ్వరరావు, సయ్యద్ మహమూద్,పర్వత శ్రీను, ముజాహిద్, యడవల్లి వీరయ్య గౌడ్, జాని షేక్, పాషా, వేపకుంట్ల మాజీ సర్పంచ్ రేమల్లే రమేష్, గుగులోత్ అనిల్, రియాజ్,తది తరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube