ఢిల్లీ హైకోర్టులో మనీశ్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది.ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
ఈ మేరకు మనీశ్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.అయితే తన భార్య అనారోగ్యంతో ఉన్న కారణంగా ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిసోడియా పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
కాగా సదరు బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది.







