కే జి ఎఫ్(KGF) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) .కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా పని చేస్తున్నటువంటి ఈయన కే జి ఎఫ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన సంచలనాలను సృష్టించడంతో ఒకసారిగా ప్రశాంత్ పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోయింది.ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఈ సినిమా సైతం బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది.ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ కు వరుసగా పాన్ ఇండియా సినిమా అవకాశాలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) హీరోగా సలార్(Salaar) అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది.ఇక ఈ సినిమా చివరి దశ షూటింగుకు వచ్చిందని చెప్పాలి.ఇకపోతే జూన్ 4వ తేదీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టినరోజు (Birthday) కావడంతో ప్రభాస్ సలార్ సెట్ లోని ఈయనకు పెద్ద ఎత్తున బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ప్రశాంత్ కేక్ కట్ చేస్తున్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అదేవిధంగా సినీ సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ ప్రశాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రామ్ చరణ్ (Ramcharan) సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పుట్టినరోజు నీకు చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ నీల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ప్రశాంత్ ఇంటికి నాటుకోడి పులుసు (Natukodi Pulusu) పంపించి సర్ప్రైజ్ చేశారు.ఇక ఈ విషయాన్ని ప్రశాంత్ భార్య లిఖితారెడ్డి(Likitha Reddy) సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ థాంక్యూ సో మచ్ అన్నయ్య అంటూ నాటుకోడి పులుసు ఫోటోలను కూడా షేర్ చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.