కరోనా తర్వాత సినిమా పరిశ్రమ తీవ్ర సంక్షోభంను ఎదుర్కొంటుంది.కొన్ని భాషల సినిమాలు కరోనా( Corona ) కారణంగా ఇంకా కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.
బాలీవుడ్ ఇండస్ట్రీ ఒకప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఎంతటి తీవ్ర తేడా ఉందో కనిపిస్తూనే ఉంది.ఒకప్పుడు వంద కోట్ల సినిమాలు ఎన్నో వచ్చేవి.
కానీ ఇప్పుడు హిందీలో వస్తున్న సినిమాలు కనీసం పబ్లిసిటీ కి ఖర్చు చేసిన మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకు రాలేక పోతున్నాయి. ఇలాంటి సమయంలో తెలుగు లో కూడా కొన్ని సినిమాలు కరోనా వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి.
పాజిటివ్ టాక్ దక్కించుకున్న సినిమాలు ఒకప్పుడు మినిమం వసూళ్లు రాబట్టేవి.కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది.చిన్న సినిమాలు కొన్ని సూపర్ హిట్ టాక్ దక్కించుకుంటే మంచి వసూళ్లు రాబడుతున్నాయి.కానీ చిన్న సినిమా లు( Small Movies ) పర్వాలేదు అన్నట్లుగా టాక్ ను దక్కించుకుంటే జనాలు వాటిని ఓటీటీ లో చూద్దాం అన్నట్లుగా వెయిట్ చేస్తున్నారు.
ఇప్పుడు బెల్లంకొండ సాయి గణేష్( Bellamkonda Sai Ganesh ) హీరోగా నటించిన సినిమా నేను స్టూడెంట్ సర్( Nenu Student Sir ) సినిమా యొక్క పరిస్థితి గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.సినిమా కు పాజిటివ్ రివ్యూ లు వచ్చాయి.ప్రేక్షకులు కూడా సినిమా పర్వాలేదు అన్నట్లుగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు.కానీ సినిమా కు వస్తున్న కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి.కరోనా తర్వాత థియేటర్లకు జనాలు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.ఓటీటీ ల సంఖ్య పెరగడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి కరోనా తో ఏర్పడిన సంక్షభం కారణంగానే నేను స్టూడెంట్ సర్ సినిమా కు కలెక్షన్స్ రావడం లేదు అంటూ నెటిజన్స్ మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.