బైక్ నడిపే వారు దానిని రెగ్యులర్‌గా చెక్ చేసుకోవాలి.అంటే అది బాగా పని చేస్తుందా అనే కోణంలో అన్ని భాగాలను పరీక్షించాలి.
బైక్ ఎక్కువ కాలం పనిచేసేలా ఓల్డ్ పార్ట్స్‌ను ఎప్పటికప్పుడు మార్చేయాలి.ఇంకా బైక్ రైడర్స్ తెలుసుకోవలసిన 10 ముఖ్యమైన విషయాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
1.ఇంజన్ ఆయిల్, ఫిల్టర్:
ఇంజన్ చక్కగా పని చేయడానికి ఆయిల్, ఫిల్టర్‌ని క్రమం తప్పకుండా మార్చాలి.
2.స్పార్క్ ప్లగ్స్:
ఇవి ఇంజన్ స్టార్ట్ చేయడంలో సహాయపడతాయి.అవి మురికిగా లేదా అరిగిపోయినప్పుడు వాటిని చెక్ చేసి కొత్త వాటితో రీప్లేస్ చేయాలి.

3.చైన్ స్ప్రాకెట్స్:
ఇవి ఇంజన్ నుంచి టైర్లకు శక్తిని బదిలీ చేస్తాయి.బైక్ ఫుల్ పవర్‌తో నడవడానికి వాటిని శుభ్రంగా ఉంచాలి.
తరచుగా లూబ్రికేట్ కూడా చేయాలి.చైన్ మరీ టైట్‌గా లేదా లూజ్‌గా లేకుండా అడ్జస్ట్ చేయాలి.
4.బ్రేక్ సిస్టమ్:
బ్రేక్ ప్యాడ్‌లు,( Brake pads ) ఫ్లూయిడ్, లైన్‌లతో సహా తరచుగా బ్రేక్‌లను చెక్ చేయాలి.అరిగిపోయిన ప్యాడ్‌లను మార్చాలి.అవసరమైతే బ్రేక్ ఫ్లూయిడ్ ఫ్లష్ చేయాలి.

5.ఎయిర్ ఫిల్టర్:
ఇంజన్ బాగా పని చేయడానికి ఎయిర్ ఫిల్టర్( Air filter )ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి లేదా మార్చాలి.

6.బ్యాటరీ
: బ్యాటరీ ఛార్జ్( Battery charge ) అయి పని చేస్తుందో లేదో తనిఖీ చేయాలి.కనెక్షన్‌లను శుభ్రం చేసి అవి గట్టిగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి.
7.సస్పెన్షన్ సిస్టమ్:
సస్పెన్షన్‌లో ఏదైనా డామేజ్ లేదా లీక్‌లు ఉన్నాయో చూడాలి.కొన్నిసార్లు ఫ్యూయల్, సీల్స్ భర్తీ చేయాలి.
8.లైట్లు ఎలక్ట్రికల్ సిస్టమ్:
అన్ని లైట్లు, ఇతర ఎలక్ట్రికల్ భాగాలు పని చేస్తున్నాయో లేదో చెక్ చేయాలి.కాలిపోయిన బల్బులను భర్తీ చేసుకోవాలి.
9.ఫ్యూయల్ సిస్టమ్:
ఫ్యూయల్ ఫిల్టర్, లైన్‌లను అడ్డంకులు లేదా లీక్‌ల కోసం తనిఖీ చేయాలి.అవసరమైతే ఫిల్టర్‌ను మార్చి ఫ్యూయల్ ఇంజెక్టర్లను శుభ్రం చేసుకోవాలి.
10.కూలింగ్ సిస్టమ్:
మీ మోటార్‌సైకిల్ కూలింగ్ సిస్టమ్( Cooling system )ను కలిగి ఉంటే, కూలంట్ స్థాయిలను తనిఖీ చేసుకోవాలి.లీక్‌లు ఏమైనా ఉన్నాయో చూసి రేడియేటర్, ఫ్యాన్ సరిగ్గా పని చేస్తున్నాయా అని నిర్ధారించుకోవాలి.
మీరు మోటార్‌సైకిల్ ఓనర్ మాన్యువల్‌లో మరిన్ని వివరాలు, తగిన సూచనలను తెలుసుకోవచ్చు.
ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకుంటే మీ మోటార్‌సైకిల్ మంచి వర్కింగ్ కండిషన్‌లో ఉంటుంది.అది మెరుగ్గా నడుస్తుంది.
ప్రయాణించేటప్పుడు మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది.