కాపుల మద్దతు పై జనసేన ధీమా .. ఆ పార్టీ కి టెన్షన్ ?

మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నా, ఏపీలో మాత్రం  కుల రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఎన్నికల్లో గెలుపును డిసైడ్ చేయగల సామర్థ్యం ఉన్న కొన్ని కులాలపై రాజకీయ పార్టీలు( Political parties ) ప్రత్యేకంగా మద్దతు పొందితే తమకు తిరుగు ఉండదనే లెక్కల్లో ఉన్నాయి.

ముఖ్యంగా జనసేన టిడిపిలు ఈ ఓట్లపై ఎక్కువగా ఆధారపడ్డాయి.జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) అభిమానులంతా పవన్ నాయకత్వాన్ని కోరుకుంటూ ఉండడంతో, జనసేన( Janasena ) ఎక్కువగా ఆ సామాజిక వర్గం పైనే ఆశలు పెట్టుకుంది.

అయితే 2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా వైసీపీకి మద్దతు తెలపడంతో ,టిడిపి జనసేనలు ఘోరంగా ఓటమి చెందాయి.వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి తలెత్తకుండా ముందుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలెర్ట్ అయిపోయారు.

దీనిలో భాగంగానే కాపు సామాజిక వర్గంలో సెంటిమెంటును రగిల్చే ప్రయత్నం చేశారు.కాపులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిస్తూనే  సీఎం క్యాండిడేట్ తాను ఎలా అవుతానని, పార్టీ శ్రేణులను ప్రశ్నిస్తున్నారు.2019 ఎన్నికల్లో స్వయంగా తనని ఓడించినప్పుడు తాను సీఎం పోస్టు కోసం ఎలా పట్టు పెట్టగలను అని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

టిడిపి, జనసేన పొత్తు( TDP and Jana Sena alliance ) పెట్టుకున్న సీఎం రేసులో తాను లేనని పవన్ ప్రకటించారు.దీని ద్వారా అభిమానుల్లో, కాపు సామాజిక వర్గంలో కసి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తమ తడాఖా చూపిస్తామని కాపు సామాజిక వర్గం వారు చెబుతున్నా, జనసేనకు ప్రస్తుతం ఉన్న బలంతో వైసీపీని ఓడించడం సాధ్యం కాదనే విషయాన్ని తెలుసుకున్నారు.

అందుకే కాపు సామాజిక వర్గం లో పట్టు పెంచే ప్రయత్నం చేస్తున్నారు.ఉభయ గోదావరి( Godavari ) జిల్లాలతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.

ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఇక్కడ వచ్చిన సీట్ల ఆధారంగానే ఆయా పార్టీలకు అధికారం దక్కుతూ ఉంటుంది.దీంతో ఇప్పుడు ఆ సామాజిక వర్గం పైనే జనసేన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.

టిడిపి ,జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీకి దిగే ఆలోచనతో ఉండడంతో, జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో కాపు సామజిక వర్గం ఓట్లు టిడిపికి పడతాయా లేదా అనే విషయంలో టిడిపి టెన్షన్ పడుతుంది.ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకుంటేనే తమకు తిరుగు ఉండదని, పూర్తిగా జనసేనపై నమ్మకం పెట్టుకున్నా, మిగతా నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం ఓటర్లు టిడిపికి అనుకూలంగా ఓటు వేస్తారా లేదా అనే విషయంలో టిడిపి టెన్షన్ పడుతోంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు