టాలీవుడ్( Tollywood ) లో మంచి ఫేమ్ ఉన్నప్పటికీ కూడా స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యడానికి పెద్దగా ఆసక్తి చూపించని డైరెక్టర్ తేజ.ఈయన కెరీర్ ప్రారంభం నుండి తనతో సినీ ప్రయాణం సాగించిన హీరోలు మరియు హీరోయిన్లు అందరూ కూడా కొత్తవాళ్లే.
కొత్తవాళ్ళతోనే ఆయన ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసాడు.నితిన్ , నవదీప్ , కాజల్ అగర్వాల్ ఇలా ఎంతో మంది టాలెంట్ ఉన్న హీరోలు మరియు హీరోయిన్లను ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు ఆయన.అంతే కాదు ప్రముఖ యాక్షన్ హీరో గోపీచంద్ కి కూడా సరికొత్త జీవితాన్ని ఇచ్చింది తేజనే.‘జయం’( Jayam ) సినిమా ద్వారా గోపీచంద్ ని విలన్ గా ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.ఆ సినిమా సంచలన విజయం సాధించిన తర్వాత గోపీచంద్ కెరీర్ లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.ఇప్పుడు రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన ‘అహింస’( Ahimsa ) అనే సినిమా నేడు విడుదలైంది.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మొదటి ఆట నుండే హింస పెట్టేసింది.ఈ చిత్రం ద్వారా ప్రముఖ హీరో రానా దగ్గుపాటి తమ్ముడు దగ్గుపాటి అభిరామ్ ( Daggubati Abhiram )ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అయ్యాడు.మొదటి సినిమాతోనే ఆయన పర్వాలేదు అనే రేంజ్ నటన ని కనబర్చాడు.అయితే రీసెంట్ గా జరిగిన కొన్ని ఇంటర్వ్యూస్ లో దగ్గుపాటి అభిరామ్ ని డైరెక్టర్ తేజ ఎలా టార్చర్ పెట్టాడో ఆయన నోటి ద్వారానే తెలియచేసాడు.
ఆయన మాట్లాడుతూ ‘మీ తాత గొప్ప నిర్మాత కావొచ్చు.మీ నాన్న గారు కూడా గొప్ప నిర్మాత.మీ చిన్ననాన్న పెద్ద స్టార్, ఇవన్నీ ఓకే, నువ్వు ఏమి పీకావు?, ఇక్కడ సెట్స్ లోకి వచ్చిన తర్వాత నువ్వు కేవలం ఒక పాత్రధారివి మాత్రమే, అదొక్కటే మైండ్ లో పెట్టుకో, మీ చిన్న నాన్న లాగ పెద్ద స్టార్ హీరో అవ్వాలంటే వాళ్ళ పేర్లు చెప్పుకొని బ్రతకడం కాదు, నిన్ను నువ్వు నిరూపించుకో అని చెను’ అంటూ డైరెక్టర్ తేజ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

చాలా సన్నివేశాలకు అభిరామ్ టేకులు బాగా తిన్నాడని, అతనిని నేను పెట్టే టార్చర్ భరించలేక , గోడ దగ్గరకి వెళ్లి ఎవ్వరికీ తెలియకుండా ఏడ్చుకునేవాడని తేజ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.ఇంత పర్ఫెక్షన్ ఉన్న వాడిలా ప్రవర్తించే తేజ కెరీర్ లో ఎందుకు హిట్స్ తక్కువ ఉన్నాయి, ఫ్లాప్స్ ఎక్కువ ఉన్నాయి అనేది ఎవరికీ అర్థం కాదు.ఈయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలను చూస్తే యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తీసుకునే కుర్రాళ్ళు ఇంకా బాగా తీస్తారు కదా, ఇంత అనుభవం ఉండి, జయం , నువ్వు నేను , చిత్రం ఇలాంటి సంచలనాత్మక సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు ఇలా అయిపోవడం బాధాకరం అని నేడు ‘అహింస’ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు అంటున్నారు.
ఇదే ఫ్లో లో పోతే భవిష్యత్తులో తేజతో సినిమాలు తియ్యడానికి ఎవ్వరూ ముందుకు రారు అని కూడా కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.







