దగ్గుబాటి కుటుంబానికి సినిమా ఇండస్ట్రీ లో పేరు ప్రఖ్యాతుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని ఏమి లేదు.వెటరన్ నిర్మాత రామానాయుడు( Ramanayudu ) గారు తెలుగు ఇండస్ట్రీ లో ఒక పెద్ద లెజెండరీ నిర్మాత.
అయన స్థానం సినిమా ఇండస్ట్రీ లో నాటి నుంచి నేటి వరకు చేరగనిది.ముఖ్యంగా అయన సినిమా ఇండస్ట్రీ కోసం చేసిన సేవ కూడా ఎంతో మంచి పేరును వారికి సంపాదించి పెట్టింది.
ఇక అయన వారసులు అయినా సురేష్ బాబు, వెంకటేష్( Suresh babu, Venkatesh ) లు తండ్రి పేరును పదింతలు పెంచారు కానీ ఎక్కడ తగ్గించలేదు.ఇక వారి వారసులు అయినా రానా ( Rana )మరియు అభిరాం కూడా సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చారు.
రానా ఇప్పటికే మంచి నటుడిగా పేరు సంపాదించుకుంటూ ఉండగా, అభిరామ్ మాత్రం ఆ మధ్య కాలంలో కాస్త ఫ్యామిలి పరువును బజారు లో వేసాడు.ఇప్పుడు అవన్నీ సర్దుమణిగిన తర్వాత తేజ ( Director Teja )దర్శకత్వం లో అభి దగ్గుబాటి హీరో గా అహింస ( Ahimsa movie )అనే సినిమా ను ప్రకటించగానే దగ్గుబాటి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇక అహింస చిత్రం తాజాగా విడుదల కాగా తేజ ఈ సినిమా కథ విషయంలో ముందుగా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి.ఇప్పటికే ఎన్నో సార్లు చుసిన సినిలాగానే ఈ చిత్రం కనిపిస్తుంది.
మరి ముఖ్యంగా నువ్వు నేను, జయం సినిమాలను కలిపితే అది అహింస అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతుంది.
సినిమా ఆసాంతం ఒక మంచి లవ్ స్టోరీ గా తెరకెక్కినప్పటికి అయన సినిమాల్లోని సీన్స్ ని తేజ స్వయంగా కాపీ కొట్టిన అభిప్రాయం సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కలుగుతుంది.ఇక అహింస సినిమాలో పూర్తి స్థాయి హింసను కూడా చూపించేసాడు తేజ.ఇక ఈ సినిమాకు సంబంధించి గొప్పగా చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే మాత్రం అది కేవలం సంగీతం మాత్రమే.ఈ చిత్రానికి చాలా రోజుల తర్వాత ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు.మొదటి నుంచి పాటలు మంచి హిట్ అవడం తో మ్యూజిక్ పరంగా ఈ సినిమా మార్కులు వేయించుకుంది కానీ మొత్తానికి ఈ సినిమా ఒక బీలో యావరేజ్ మూవీ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.