సినిమా ఇండస్ట్రీలో తరచూ ఎవరో ఒక సెలబ్రిటీ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.అయితే అందులో చాలా వరకు రూమర్సే ఉంటాయని చెప్పవచ్చు.
ఇంతమంది కావాలని పని కట్టుకొని మరి సెలబ్రిటీలను( Celebrities ) ట్రోల్స్ చేస్తూ నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ఉంటారు.కొంతమంది సెలబ్రిటీలు వాటిని చూసి చూడనట్టుగా వదిలేయగా మరికొందరి మాత్రం అలాంటి కామెంట్స్ చేసే వారికి ఇష్టంగా కౌంటర్ ఇస్తూ ఉంటారు.

తాజాగా కూడా బాలీవుడ్ నటుడు ఆయుష్ శర్మను( Ayush Sharma ) టార్గెట్ చేస్తూ కొంతమంది నెగటివ్ గా కామెంట్ చేయడంతో తాజాగా ఆ వార్తల స్పందించాడు ఆయుష్ శర్మ.బాలీవుడ్ స్టార్ హీరో అండ్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ ను ఆయుష్ శర్మ పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.2014లో వీరి పెళ్లి జరిగింది.వీరికి అహిల్( Ahil ) అనే కుమారుడు అయత్ అనే కూతురు కూడా ఉన్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో వారి పెళ్లి విషయంలో వచ్చిన వార్తలపై ఆయుష్ శర్మ మాట్లాడుతూ.అర్పిత చాలా శక్తివంతమైన అమ్మాయి.అలాంటి అమ్మాయి భార్యగా రావడం నిజంగా నా అదృష్టం.మా మీద జరిగే ట్రోలింగ్ మమ్మల్ని అంతగా బాధించదు.

ఎందుకంటే సినిమా పరిశ్రమలో( film industry ) ఉన్నవారికి ఇలాంటివన్నీ కూడా మామూలే అని మాకు బాగా తెలుసు.కానీ నేను బాగా బాధపడిన విషయం ఏమిటంటే.నేను అర్పితను కేవలం డబ్బుల కోసమే పెళ్లి చేసుకున్నానని నటుడుగా ఎదగడానికి ఆమెను వాడుకున్నాను అంటూ నన్ను చాలామంది ట్రోల్స్ చేశారు.కానీ మీరు అనుకుంటున్నాం అంతా అబద్ధం.
నేను డబ్బును కాదు అర్పితను ప్రేమించాను.అందుకే తనను పెళ్లి చేసుకున్నాను.
ఆ విషయం తనకు, నాకు,మా కుటుంబాలకు బాగా తెలుసు.మరొక విషయం ఏమిటంటే నేను ఏదైనా వెకేషన్ కు వెళ్ళినప్పుడు అందరూ నేను సల్మాన్ ఖాన్ డబ్బులు ఖర్చు పెడుతున్నానని విమర్శించేవారు.
నా పెళ్ళికి సల్మాన్ రూల్స్ రాయిస్ కార్ గిఫ్ట్ ఇచ్చాడంట కూడా వార్తలు రాశారు.మరి ఆ రోల్స్ రాయిస్ కారు ఏమయ్యింది ఎక్కడుంది అనేది ఇప్పటికి నాకు అర్థం కావడం లేదు అని చెప్పుకొచ్చాడుఆయుష్ శర్మ.