వరుస విజయాలతో భారీగా రెమ్యునరేషన్ ను పెంచిన నిఖిల్.. ఆ మూవీకి ఎన్ని రూ.కోట్లంటే?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నిఖిల్ ( Hero Nikhil ) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.సినిమా సినిమాకు నిఖిల్ కు ఊహించని స్థాయిలో పాపులారిటీ పెరుగుతోంది.

 Hero Nikhil Hikes His Remuneration Details, Nikhil, Hero Nikhil, Hero Nikhil Rem-TeluguStop.com

పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న నిఖిల్ తర్వాత ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.స్వయంభు( Swayambhu Movie ) అనే టైటిల్ తో నిఖిల్ కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు నిఖిల్ ఏకంగా 8 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.చిన్న పాత్రలతో కెరీర్ ను మొదలుపెట్టిన నిఖిల్ సినిమా సినిమాకు అంతకంతకూ ఎదుగుతూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

కార్తికేయ 2( Karthikeya 2 ) సక్సెస్ తో పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్ గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.స్వయంభు మూవీకి ఠాకూర్ మధు నిర్మాతగా ఉన్నారు.

Telugu Nikhil, Karthikeya, Thakur Madhu, Swayambhu-Movie

టాప్ బ్యానర్లలో సినిమాలకు నిఖిల్ బెస్ట్ ఆప్షన్ గా నిలిచారు.నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇదేనని సమాచారం అందుతోంది.ఈ సినిమాకు నిఖిల్ లాభాల్లో వాటా కూడా తీసుకోనున్నారని తెలుస్తోంది.వార్ బ్యాక్ డ్రాప్ లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో నిఖిల్ మరో పాన్ ఇండియా సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

Telugu Nikhil, Karthikeya, Thakur Madhu, Swayambhu-Movie

కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా నిఖిల్ జాగ్రత్త పడాలని కొంతమంది సూచనలు చేస్తున్నారు.బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన నిఖిల్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది.ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలని నిఖిల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.తన సినిమాలతో ఇతర భాషల్లో కూడా నిఖిల్ సత్తా చాటాలని అభిమానులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube