వరుస విజయాలతో భారీగా రెమ్యునరేషన్ ను పెంచిన నిఖిల్.. ఆ మూవీకి ఎన్ని రూ.కోట్లంటే?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నిఖిల్ ( Hero Nikhil ) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

సినిమా సినిమాకు నిఖిల్ కు ఊహించని స్థాయిలో పాపులారిటీ పెరుగుతోంది.పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న నిఖిల్ తర్వాత ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

స్వయంభు( Swayambhu Movie ) అనే టైటిల్ తో నిఖిల్ కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు నిఖిల్ ఏకంగా 8 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.

చిన్న పాత్రలతో కెరీర్ ను మొదలుపెట్టిన నిఖిల్ సినిమా సినిమాకు అంతకంతకూ ఎదుగుతూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

కార్తికేయ 2( Karthikeya 2 ) సక్సెస్ తో పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్ గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.

స్వయంభు మూవీకి ఠాకూర్ మధు నిర్మాతగా ఉన్నారు. """/" / టాప్ బ్యానర్లలో సినిమాలకు నిఖిల్ బెస్ట్ ఆప్షన్ గా నిలిచారు.

నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇదేనని సమాచారం అందుతోంది.

ఈ సినిమాకు నిఖిల్ లాభాల్లో వాటా కూడా తీసుకోనున్నారని తెలుస్తోంది.వార్ బ్యాక్ డ్రాప్ లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో నిఖిల్ మరో పాన్ ఇండియా సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

"""/" / కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా నిఖిల్ జాగ్రత్త పడాలని కొంతమంది సూచనలు చేస్తున్నారు.

బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన నిఖిల్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది.

ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలని నిఖిల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.తన సినిమాలతో ఇతర భాషల్లో కూడా నిఖిల్ సత్తా చాటాలని అభిమానులు భావిస్తున్నారు.

ఎవరి దారి వారిదే.. సమంత విషయంలో మీడియా సైలెంట్ గా ఉంటే బెటర్!