లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ( Lavanya Tripathi )ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ రెండు పేర్లు హాట్ టాపిక్ గా మారాయి.లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ లు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
గతంలో కూడా అనేకసార్లు వార్తలు వినిపించినప్పటికీ తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ కన్ఫామ్ అయ్యిందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఇరు కుటుంబాల సమక్షంలో ఈ నెల 9న వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగబోతోంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయని, పలువురు సెలబ్రిటీలకు ఆహ్వానం కూడా అందిందని తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ జంటకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త తెగ వైరల్ అవుతోంది.అదేంటంటే లావణ్య, వరుణ్ ల మధ్య ప్రేమకు కారణం ప్రేమకు డైరెక్టర్ శీను వైట్ల( Srinu Vaitla ) అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.లావణ్య, వరుణ్ లు 2017లో శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్ అనే సినిమా( Mister )లో కలిసి నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా సమయంలోనే లావణ్య, వరుణ్ ల మధ్య ప్రేమ పుట్టినట్లు తెలుస్తోంది.ఇకపోతే హీరో వరుణ్ తేజ్ విషయానికి వస్తే.తెలుగులో వరుణ్ ముకుంద, ఫిదా, గద్దల కొండ గణేష్,ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి సినిమాలలో నటించే హీరోగా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.

లావణ్య విషయానికి వస్తే.అందాల రాక్షసి( Andala Rakshasi ) సినిమాతో పరిచయమైన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలలో నటించి మెప్పించింది.తెలుగులో లావణ్య ఉన్నది ఒకటే జిందగీ, ఏ 1 ఎక్స్ప్రెస్, సోగ్గాడే చిన్నినాయన,చావు కబురు చల్లగా, భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు లాంటి సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది లావణ్య త్రిపాఠి.
అందం అభినయం అన్నీ ఉన్నప్పటికీ అవకాశాలను అందుకోవడంలో మాత్రం ఈ ముద్దుగుమ్మ వెనకబడింది.







