సాధారణంగా మనం ఏదైనా కనీస ఎత్తైన భవనం నుండి దురదృష్టవశాత్తు పడిపోతే చనిపోవడం అయితే జరగదు కానీ… కాళ్ళో, చేతులో విరిగిపోవడం ఖాయం.అలాంటిది ఓ నాలుగైదు అంతస్తులనుండి పడిపోతే ఏం జరుగుతుందో ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు.
ప్రాణం గాల్లోనే కలిసిపోతుంది.అలాంటిది ఓ పిల్లి ( Cat ) ఏకంగా ఆరో అంతస్తునుండి పడిపోయింది.
కానీ దానికి ఏమి కాకపోవడం ఇపుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ఇక్కడ మీరు పిల్లి కదా.తేలికైన జీవి కదా, అందుకే ఏం జరగలేదు అని అనుకోవచ్చు!

వివరాల్లోకి వెళితే, బ్యాంకాక్‌లో( Bangkok ) దాదాపు 8.5 కేజీల బరువున్న ఓ పిల్లి పొరపాటున ఆరో అంతస్తు( Sixth Floor ) నుండి అమాంతం కిందికి దూకేసింది.అదృష్టం కొద్దీ అంతెత్తు నుండి పడిపోయినా కూడా ఆ పిల్లికి చిన్న గాయమైనా తాగకలాపోవడం చూసి దాని యజమానే కాకుండా డాక్టర్ కూడా ఆశ్చర్య పోయాడు.ఈ క్రమంలో ఈ పిల్లి నేరుగా పార్కింగ్ చేసి ఉన్న ఒక కార్ మీద పడటంతో దాని బరువుకు కారు వెనుక అద్దం మాత్రమే పగిలింది.

బ్యాంకాక్ కు చెందిన అపివాత్ టొయోతక అనే మహిళ ఆ పిల్లిని ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది.అయితే ఆమె బయటకు వెళ్లేముందు కిటికీ తలుపు వేయడం మరిచిపోయింది.ఇంకేముంది, కట్ చేస్తే ఆ పిల్లి స్వేచ్ఛగా బయటకు వెళ్లి షికారు చేయాలనుకుని, కిటికీలోనుంచి అమాంతం దూకేసింది.అదృష్టవశాత్తు అది పార్కింగ్ చేసి ఉన్న ఒక కారు అద్దం మీద పడటంతో అద్దాన్ని పగలగొట్టుకుని కార్ సీటు మీద సేఫ్ గా ల్యాండ్ అయ్యింది.
మరి దీనినే అదృష్టం అంటారు.ఈ ఘటన తరువాత భయపడిన ఓనర్ దానిని డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్లగా అక్కడక్కడా కారు అద్దం గీసుకున్న గాయాలు తప్ప దాని ఒంటి మీద వేరే గాయాలు లేకపోవడం చూసి మృత్యుంజయురాలైన షిఫు (పిల్లి)ని చూసి ఆశ్చర్యపోయారు.







