గూగుల్ క్రోమ్ ( Google chrome )గురించి తెలియనివారు ఎవరూ ఉండరు.ఇంటర్‌నెట్ గురించి అవగాహన ఉన్న ప్రతిఒక్కరికీ, ఇంటర్నెట్‌ను వాడేవారికి గూగుల్ క్రోమ్ గురించి ఇంకా బాగా తెలుస్తుంది.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గా గూగుల్ క్రోమ్‌కు మంచి పేరు ఉంది.ఏదైనా సమాచారం కావాలన్నా.
ఆన్‌లైన్‌లో ఏ పని కావాలన్నా సరే గూగుల్ క్రోమ్ ఉపయోగించాల్సిందే.వాడటానికి చాలా సింపుల్‌గా ఉండటం, అనేక ఫీచర్లు ఉండటంతో మిగతా సెర్చ్ ఇంజిన్ ఫ్లాట్‌ఫామ్స్ కంటే గూగుల్ క్రోమ్‌ను ఎక్కువమంది వాడతారు.
చాలా మొబైల్స్‌లో కూడా డీఫాల్ట్‌గా గూగుల్ క్రోమ్ వస్తుంది.ఇక పీసీలతో పాటు ల్యాప్‌ట్యాప్( Laptop )లో కూడా గూగుల్ క్రోమ్ ఉపయోగించడానికి చాలా సులువుగా ఉంటుంది.
అయితే గూగుల్ క్రోమ్‌లో చాలా ఫీచర్లు ఉన్నాయి.ఇవి చాలామందికి తెలియదు.అందుకే వీటిని ఉపయోగించుకోరు.ఈ చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించుకోవడం ద్వారా గూగుల్ క్రోమ్‌ను ఉపయోగించడం మరింత సులువు అవుతుంది.అవేంటో ఇప్పుడు చూద్దాం.

గూగుల్ క్రోమ్‌లో స్లైడింగ్ ఆప్షన్ చాలా ఉపయోగపడుతుంది.ఒక ట్యాబ్ నుంచి మరొక ట్యాబ్‌కు గ్లైడ్ చేయవచ్చు.అడ్రస్ బార్ లో మీరు ఓపెన్ వెళ్లాలనుకుంటున్న తదుపరి ట్యాబ్ దిశలో మీ వేలిని స్వైప్ చేయడం ద్వారా దీనిని ఉపయోగించుకోవచ్చు.
ఇక ట్యాబ్‌లన్నింటినీ ఒకేసారి క్లోజ్( Close Chrome Tabs ) చేసే ఫీచర్ గూగుల్ క్రోమ్‌లో ఉంది.దీని కోసం అడ్రస్ బార్‌కు కుడివైపున ఉన్న ట్యాబ్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మూడు డాట్ మెను బార్‌ను నొక్కండి.దీంతో ట్యాబ్‌లన్నీ క్లియర్ అవ్వుతాయి.

ఇక హోంపేజీగా వెబ్‌పేజీని పెట్టుకునే సౌకర్యం కూడా ఉంది.బ్రౌజర్‌ను తెరిచి మూడు చుక్కల మెనూపై క్లిక్ చేయాలి.ఆ తర్వాత సెట్టింగ్‌లకు వెళ్లి కిందకు స్క్రోల్ చేయాలి.యూఆర్‌ఎల్ను నమోదు చేసి పక్కన ఉన్న వృత్తార చిహ్నంపై క్లిక్ చేస్తే మీరు హోమ్ పేజీగా గూగుల్ క్రోమ్‌ను పెట్టుకోవచ్చు.







