సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ఏ పార్టీ ప్రతిపక్షమో అర్థం కావడం లేదని తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జరిగే సభ వాయిదా పడటంపై కూనంనేని మండిపడుతున్నారు.కాగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో తమ సభకు అనుమతి రద్దు చేశారంటూ ధ్వజమెత్తారు.
తమ సభను అడ్డుకోవడం అనేది అప్రజాస్వామిక చర్యని స్పష్టం చేశారు.అయితే ఈనెల 4వ తేదీన కొత్తగూడెంలో జరగాల్సిన సభ ఈనెల 11కు వాయిదా పడిన సంగతి తెలిసిందే.