తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.ఈ క్రమంలో సర్వే చేపట్టి ఆరు నెలల్లో పూర్తి చేయాలని రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
విశాఖ- విజయవాడ- శంషాబాద్ మరియు విశాఖ -విజయవాడ – కర్నూలు మార్గంలో రైల్వే బోర్డు సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు సర్వే నిర్వహించనుంది.దీని ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య రైల్వే అనుసంధానం మరింత బలోపేతం కానుంది.