పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా అదేనా!

కమర్షియల్ సినిమాలకు బిన్నంగా , లవ్ స్టోరీస్ ని తెరకెక్కించి దర్శకుడు తేజ( Director Teja ).చిత్రం , నువ్వు నేను, జయం ఇలా వరుసగా హ్యాట్రిక్ హిట్స్ తో ముందుకు దూసుకెళ్లిన తేజ , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి.

 Reason Behind Director Teja Pawan Kalyan Movie Halted,director Teja,pawan Kalyan-TeluguStop.com

మంచి టాలెంట్ ఉన్నప్పటికీ ఎందుకో ఆయన ఒకే మూసలో పడిపోయి, వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అందుకొని కెరీర్ ని నాశనం చేసుకున్నాడు.అయితే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత ఆయన ప్రముఖ హీరో రానా దగ్గుపాటి తో ‘నేనే రాజు నేనే మంత్రి'( Nene Raju Nene Mantri ) అనే చిత్రాన్ని తీసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.

ఈ సినిమా బాహుబలి చిత్రం తర్వాత విడుదలైంది.రానా కి కూడా మంచి మాస్ కమర్షియల్ హిట్ గా నిల్చింది.

ఆ తర్వాత ‘సీత'( Sita ) అనే చిత్రం చేసాడు.కాజల్ అగర్వాల్ ని ఈ చిత్రం నెగటివ్ షేడ్ లో బాగానే చూపించాడు కానీ, కమర్షియల్ గా మాత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది.

Telugu Ahimsa, Teja, Pawan Kalyan, Tollywood, Ustaadbhagat-Movie

ఇప్పుడు ఆయన దగ్గుపాటి రానా తమ్ముడు దగ్గుపాటి అభిరాం( Daggubati Abhiram ) ని ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం చేస్తూ ‘అహింస'( Ahimsa ) అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.ఈ సినిమా జూన్ నెలలో విడుదల కాబోతుంది.ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ ని చూస్తుంటే జయం సినిమానే గుర్తుకు వస్తుంది.పేరుకి అహింస అని టైటిల్ పెట్టారు కానీ, ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం హింస అనే అనిపిస్తుంది.

ఇదే విషయాన్నీ తేజ ని అడగగా, టైటిల్ పెట్టినంత మాత్రాన కేవలం అహింస మాత్రమే ఉండాలా?, హింస కి అహింస కి మధ్య ఉన్న తేడా ని చెప్పడానికే ఈ చిత్రాన్ని తీసాను అంటూ చెప్పుకొచ్చాడు.ఇకపోతే తేజ ఇప్పటి వరకు ఎక్కువగా కొత్త వాళ్ళతోనే సినిమాలు తీస్తూ వచ్చాడు.ఆయన స్టార్ హీరోలతో పనిచెయ్యడం ఒక్క మహేష్ బాబు తోనే జరిగింది.‘ఒక్కడు'( Okkadu ) వంటి భారీ హిట్ తర్వాత మహేష్ బాబు ఈయనతో ‘నిజం'( Nijam ) అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది కానీ, మహేష్ బాబు నటనకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Telugu Ahimsa, Teja, Pawan Kalyan, Tollywood, Ustaadbhagat-Movie

కేవలం మహేష్ బాబు( Mahesh Babu ) తోనే కాదు , ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమా చెయ్యాల్సి ఉంది.AM రత్నం నిర్మాతగా ఈ చిత్రం జయం సినిమా తర్వాత రావాల్సింది.కానీ స్క్రిప్ట్ లో మితిమీరిన వయోలెన్స్ ఉండడం వల్ల పవన్ కళ్యాణ్( Powerstar Pawan Kalyan ) ఒప్పుకోలేదట.

మళ్ళీ ఆ స్క్రిప్ట్ తో తేజ కూడా మరో హీరో తో చెయ్యలేదు.అది పవన్ కళ్యాణ్ కోసమే రాసుకున్న స్టోరీ అని, వేరే హీరో తో చేసే ఛాన్స్ లేదని గతం లో ఆయన ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.

ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో తేజ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ టీజర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి ప్రశంసల వర్షం కురిపించాడు.టీజర్ చూడగానే బ్లాక్ బస్టర్ అనిపించింది అని, పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తే ఇలా ఉండాలి అంటూ తేజ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube